న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఓపెనింగ్‌ బ్యాట్సమన్‌గా దిగడం అంత సులువు కాదు'

ICC Cricket World Cup 2019, India vs Australia: Challenges Of Opening Ahead Of Indias Clash Against Australia, Pitch Conditions playing a huge role in this World Cup says Rohit Sharma

ఓపెనింగ్‌ బ్యాట్సమన్‌గా దిగడం అంత సులువు కాదు. ఓపెనింగ్‌ ఏప్పుడూ ఛాలెంజింగ్‌గా ఉంటుంది అని టీమిండియా ఓపెనర్, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపారు. శనివారం నిర్వహించిన విలెకర్ల సమావేశంలో రోహిత్ మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ ఓపెనింగ్‌ భాగస్వామ్యంతో సహా పలు విషయాలు పంచుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

రోహిత్ మాట్లాడుతూ... 'టీమిండియా తరఫున ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా దిగటం అంత సులువు కాదు. ఓపెనింగ్‌ ఏప్పుడూ ఛాలెంజింగ్‌గా ఉంటుంది. బ్యాటింగ్‌ చేస్తుండగా రికార్డుల కోసం ఆలోచించను, జట్టు విజయానికి మాత్రమే కృషి చేస్తా. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై చేసిన 122 పరుగుల ఇన్నింగ్స్‌ ఎంతో ప్రత్యేకం. ప్రతికూల పరిస్థితుల మధ్య శతకం సాధించడం సంతోషంగా ఉంది' అని రోహిత్ తెలిపాడు.

'దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో నాలుగో స్థానంలో కేఎల్‌ రాహుల్‌ బాగా ఆడాడు. కీలక సమయంలో రాహుల్‌ చేసింది 26 పరుగులే అయినా.. అవి 50 పరుగులతో ససమానం. ఈ టోర్నీలో అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా వాటిని అందుకుంటాడు. ఇంగ్లాండ్‌లో ఆడిన 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఐదు మ్యాచ్‌ల్లో 304 పరుగులు చేయడం మంచి అనుభవాన్ని పంచింది' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్‌ ఆడుతోంది. టాస్ నెగ్గిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా భారత బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (9), శిఖర్ ధావన్ (11)లు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 22 పరుగులు చేసింది.

Story first published: Sunday, June 9, 2019, 15:44 [IST]
Other articles published on Jun 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X