59 బంతుల్లో 89: బట్లర్‌ను తలపించిన హారిస్ సోహైల్ బ్యాటింగ్

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ లాగా హారిస్‌ సోహైల్‌ బ్యాటింగ్‌ చేశాడని పాకిస్థాన్ కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్‌ వ్యాఖ్యానించాడు. టోర్నీలో భాగంగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. హారిస్‌ సోహైల్‌ 59 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 89 పరుగులు చేసి పాకిస్థాన్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో హారిస్ సోహైలై ఇన్నింగ్స్‌పై సర్ఫరాజ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

"హారిస్ సోహైల్‌ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి 15 ఓవర్లలో అతడు బ్యాటింగ్‌ చేసిన విధానం ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జోస్‌ బట్లర్‌ను తలపించింది" అని సర్ఫరాజ్‌ అన్నాడు. ఇది జట్టు సమష్టి విజయమని సర్ఫరాజ్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా, ఈ మ్యాచ్‌లో షోయబ్‌ మాలిక్‌ స్థానంలో హారిస్‌ సోహైల్‌కు అవకాశమిచ్చాడు.

తనకు వచ్చిన అవకాశాన్ని సోహైల్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ విజయంతో పాక్ తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికా లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో ఐదు పాయింట్లు సాధించి పాకిస్థాన్ ఏడో స్థానానికి చేరుకుంది. తదుపరి మ్యాచ్‌ కివీస్‌తో 26న ఆడనుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, June 24, 2019, 14:26 [IST]
Other articles published on Jun 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X