న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

ICC Cricket World Cup 2019, England vs Sri Lanka: Sri Lanka have won the toss and have opted to bat

ప్రపంచకప్‌లో భాగంగా మరికొద్ది సేపట్లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో శ్రీలంక తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కరుణ రత్నె బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తుందని లంక కెప్టెన్ తొలుత బ్యాటింగ్ వైపే మొగ్గు చూపించాడు. లంక రెండు మార్పులు చేసింది. జీవన్ మెండీస్, అవిష్క ఫెర్నాండోలు జట్టులోకి వచ్చారు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఐదు మ్యాచ్‌లాడిన లంక ఒకదాంట్లో గెలిచి.. రెండింటిలో ఓడిపోయింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. సెమీస్ చేరాలంటే లంక తమ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో లంకకు ఈ మ్యాచ్ చాలా కీలకం. భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ను నిలువరిస్తేనే లంక విజయంపై ఆశలు పెట్టుకోవాలి.

ఇరు జట్లు ఇప్పటివరకు 74 మ్యాచ్‌ల్లో తలపడగా.. లంక 35 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇంగ్లండ్‌ 36 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ టై కాగా.. రెండింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌లలో పోటీపడితే.. నాలుగింట్లో లంక, ఆరు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలిచాయి. లీడ్స్ మైదానంలో ఇది మొదటి ప్రపంచకప్ మ్యాచ్. ఈ వేదికపై ఇంగ్లాండ్ చివరి ఆరు వన్డేలను గెలుచుకుంది.

Teams:
England:
James Vince, Jonny Bairstow, Joe Root, Eoin Morgan(c), Jos Buttler(w), Ben Stokes, Moeen Ali, Chris Woakes, Adil Rashid, Jofra Archer, Mark Wood.

Sri Lanka: Dimuth Karunaratne(c), Kusal Perera(w), Avishka Fernando, Kusal Mendis, Angelo Mathews, Thisara Perera, Jeevan Mendis, Dhananjaya de Silva, Isuru Udana, Lasith Malinga, Nuwan Pradeep.

Story first published: Friday, June 21, 2019, 14:54 [IST]
Other articles published on Jun 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X