న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌.. గణంకాలతో పోల్చితే అతడి ఎంపిక సరైందే!!

ICC Cricket World Cup 2019: England vs South Africa: Stats reveal Virat Kohli was right in picking Faf du Plessis in his team

దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఫా డు ప్లెసిస్‌ను ఎంపిక చేసుకోవడం సరైన విషయమేనని అతడి గణంకాలు చూస్తే ఇదే విషయం స్పష్టమౌతోందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పది జట్ల కెప్టెన్లకు ఇతర జట్ల నుంచి ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో కోహ్లీ.. డుప్లెసిస్‌ను ఎంపిక చేసుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసంకోహ్లీ మాట్లాడుతూ.. 'మా జట్టు పటిష్టంగా ఉన్నందున ఇతర జట్ల నుంచి వేరే ఆటగాడిని ఎంపిక చేసుకోవడం కష్టం. ఒకవేళ అలా చెయ్యాల్సివస్తే.. డివిలియర్స్‌ లేనందున అతడికి బదులు డుప్లెసిస్‌ని ఎంపిక చేసుకుంటా' అని విరాట్ తెలిపాడు. అయితే కోహ్లీ ఎంపికకు సరైన కారణాలే ఉన్నాయి. 2015 ప్రపంచకప్‌ నుంచి డుప్లెసిస్‌ మంచి ఫామ్ లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ (2971) తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డుప్లెసిస్‌ (2777) ఉన్నాడు. మరోవేపు డికాక్‌తో సమానంగా 24 అర్థ శతకాలు చేసాడు.

ఇక కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రన్‌రేటు కూడా పెరిగింది. కోహ్లీ (83.92) తర్వాత డుప్లెసిస్‌(61.15) సగటుతో రెండో స్థానంలో ఉన్నాడు. 2015కి ముందు, తర్వాత డుప్లెసిస్‌ గణంకాల్లో చాలా తేడా ఉంది. డుప్లెసిస్‌ సగటు 2015కి ముందు 36.6గా ఉండగా.. అనంతరం 60.36కి పైగా నమోదయింది. స్ట్రైక్‌ రేట్‌, అర్థ శతకాల సంఖ్య కూడా పెరిగింది. ఈ గణాంకాలు అన్ని చూస్తే కోహ్లీ నిర్ణయం సరైందనని తెలుస్తోంది.

Story first published: Friday, May 31, 2019, 11:58 [IST]
Other articles published on May 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X