న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కేఎల్‌ రాహుల్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలి'

ICC Cricket World Cup 2019: KL Rahul Could Be An Option For India At No 4 Says Vengsarkar | Oneindia
ICC Cricket World Cup 2019: Dilip Vengsarkar wants India to try KL Rahul at No.4

రాహుల్‌ టెక్నిక్‌ దృష్ట్యా ఇంగ్లండ్‌ పరిస్థితులు అతనికి సరిగ్గా సరిపోతాయి. ప్రపంచకప్‌లో కేఎల్‌ రాహుల్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని టీమిండియా మాజీ ఛీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అభిప్రాయపడ్డారు. గత కొన్నాళ్లుగా టీమిండియాకు నాలుగో స్థానంలో ఆడిన అంబటి రాయుడు ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక కాలేదు. ఈ స్థానంలో ఆల్‌రౌండర్‌ విజయ్ శంకర్‌ను ఎంపికయినా.. అతడు ఆ స్థానంలో ఆడతాడా? అన్న అనుమానం ఉంది. ఈ స్థానంలో పోటీకి దినేష్ కార్తీక్, కేఎల్‌ రాహుల్‌లు కూడా ఉన్నారు. దీంతో ఎవరు నాలుగో స్థానంలో ఆడుతారో చర్చ జరుగుతోంది.

 రాహుల్‌ సరైన ఎంపిక:

రాహుల్‌ సరైన ఎంపిక:

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ వెంగ్‌సర్కార్‌ స్పందించారు. 'ధావన్‌, రోహిత్‌లు ఓపెనింగ్‌లో పరుగులు చేస్తారు. మూడో స్థానంలో విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. ఈ ముగ్గురుకి తోడు నాలుగో స్థానంలో కేఎల్‌ రాహుల్‌ సరైన ఎంపిక. తన టెక్నిక్‌ బ్యాటింగ్తో టాప్‌ ఆర్డర్‌కు సహకారం అందించగలడు. నాలుగో స్థానంలో స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌ ఆడాలని కోరుకుంటున్నా' అని వెంగ్‌సర్కార్‌ అన్నారు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలి:

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలి:

'రాహుల్ స్పెషలిస్టు ఓపెనర్‌ కూడా. ఒకవేళ టాప్‌ ఆర్డర్‌ త్వరగా పెవిలియన్ చేరితే.. రాహుల్‌ జట్టుకు అండగా నిలబడగలడు. సుదీర్ఘ టోర్నీలో అవసరమైతే అతను ఓపెనింగ్‌ కూడా చేయగలడు. రాహుల్‌ టెక్నిక్‌ దృష్ట్యా ఇంగ్లండ్‌ పరిస్థితులు అతనికి సరిగ్గా సరిపోతాయి. ప్రపంచకప్‌లో కేఎల్‌ రాహుల్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలి. అతను కచ్చితంగా తుది జట్టులో ఉండాలి' అని వెంగ్‌సర్కార్‌ పేర్కొన్నారు.

ఆ జట్లు సెమీస్‌ చేరుకుంటాయి:

ఆ జట్లు సెమీస్‌ చేరుకుంటాయి:

'ఆటగాళ్లు అందరూ ఇంగ్లాండ్‌లో వాతావరణానికి అలవాటు పడడం కీలకం. టీమిండియా గతేడాది అక్కడ ఆడడం అనుకూలించే అంశం. స్పిన్నర్లు కుల్‌దీప్‌, యుజువేంద్ర చాహల్‌ అక్కడ రాణించగలరు. మన బ్యాటింగ్ కూడా బాగుంది. భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా సెమీస్‌ చేరుకుంటాయి' అని వెంగ్‌సర్కార్‌ చెప్పుకొచ్చారు.

ఇప్పుడే ఆలోచించడం లేదు:

ఇప్పుడే ఆలోచించడం లేదు:

'మనకు అద్భుతమైన జట్టు ఉంది. అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగల క్రికెటర్లు జట్టులో ఉన్నారు. అంతేకాదు నెంబర్. 4 స్థానంలో ఆటగల బ్యాట్స్‌మెన్ సైతం ఉన్నారు. ప్రస్తుతం దాని గురించే అస్సలు ఆలోచించడం లేదు. వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికైన 15 మంది ఆటగాళ్లలో ఇచ్చిన సమయంలో ఎప్పుడైనా ఆడగలరు' అని కోచ్ రవిశాస్త్రి తెలిపారు. దీంతో ఎవరు నాలుగో స్థానంలో ఆడుతారో ఇప్పటికైతే తెలియట్లేదు.

Story first published: Friday, May 17, 2019, 10:19 [IST]
Other articles published on May 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X