న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఈసారి వరల్డ్‌కప్‌లో భారత బౌలర్లదే హవా'

ICC Cricket World Cup 2019: Brett Lee feels India can dominate world cricket with bowlers


హైదరాబాద్: కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు అద్భుతమైన బౌలింగ్‌ లైనప్‌ను కలిగి ఉందని ఆస్ట్రేలియా మాజీ పేస్ దిగ్గజం బ్రెట్ లీ అన్నాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల బ్రెట్ లీ మాట్లాడుతూ టీమిండియా ప్రపంచ క్రికెట్‌లో దూసుకుపోతుంది అంటే అందుకు బౌలర్లే కారణమని తెలిపాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌లో భారత బౌలర్లు సత్తా చాటుతారని అన్నాడు. బ్రెట్ లీ మాట్లాడుతూ "ఇండియాలో నిజమైన పేస్‌ని తొలిసారి చూస్తున్నా. షమీ, బుమ్రా లాంటి యువ బౌలర్లు జట్టులో ఉన్నారు. ప్రస్తుతం భారత బౌలింగ్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఒక విదేశీ ఆటగాడిగా భారత్‌ను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది" అని తెలిపాడు.

తన బౌలింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఏలుతుంది

తన బౌలింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఏలుతుంది

"టీమిండియా తన బౌలింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఏలుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు" అని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు. ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా గత కొంత కాలంగా వన్డేల్లో పేలవ ప్రదర్శన చేసింది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఒక్క వన్డే సిరిస్‌ను కూడా నెగ్గలేకపోయింది.

2018లో బాల్ టాంపరింగ్ ఉదంతం

2018లో బాల్ టాంపరింగ్ ఉదంతం

సఫారీ గడ్డపై 2018లో జరిగిన బాల్ టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియాను ప్రపంచ క్రికెట్ ముందు దోషిగా నిలబెట్టింది. ఆయితే, ఆ తర్వాత కొన్ని నెలలు పాటు ఆసీస్ చెత్త ప్రదర్శన చేసింది. కాగా, వరల్డ్‌కప్‌కు ముందు ఆ జట్టు అనూహ్యాంగా పుంజుకుంది. సొంతగడ్డపై భారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌ను 3-2తో కైవసం చేసుకుంది.

ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ విజయం

ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ విజయం

వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా ఆస్ట్రేలియా ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ ఫేవరేట్ అయినప్పటికీ... డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోన్న ఆస్ట్రేలియా కూడా మంచి జట్టే అని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా మంచి జట్టు

ఆస్ట్రేలియా మంచి జట్టు

"ఆస్ట్రేలియా మంచి జట్టు. వరల్డ్‌కప్‌కి వెళ్లే జట్టు ఏదైనా సిద్ధంగా ఉంటుంది. ఇక, ఇంగ్లాండ్ పరిస్థితులను ఎవరు బాగా అలవాటు చేసుకుంటారో వాళ్లే విశ్వవిజేతగా నిలుస్తారు" అని బ్రెట్ లీ తెలిపాడు. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా తన ఆరంభ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 1న బ్రిస్టల్ వేదికగా జరగనుంది.

Story first published: Tuesday, May 28, 2019, 17:52 [IST]
Other articles published on May 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X