న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కెమెరా ముందు చెప్పారు కానీ.. బౌలర్లకు నేనంటే ఇప్పటికీ భయమే'

ICC Cricket World Cup 2019: Bowlers Wont Say it on Camera, But They Are Scared of Me says Chris Gayle

కెమెరా ముందు చెప్పారు కానీ.. నిజానికి బౌలర్లకు నేనంటే ఇప్పటికీ భయమే అని 'యూనివర్సల్‌ బాస్', వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌ గేల్‌ తెలిపారు. ఐపీఎల్-12లో అదరగొట్టడంతో గేల్‌ ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించాడు. మే 30 నుండి జరగనున్న ప్రపంచకప్‌ కోసం ఇప్పటికే వెస్టిండీస్ ఆటగాళ్లు ఇంగ్లండ్ చేరుకున్నారు. ఐదో ప్రపంచకప్‌ ఆడేందుకు క్రిస్‌ గేల్‌ ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాడు.

ఆఫ్‌ ద రికార్డ్‌ అడిగితే నిజం తెలుస్తుంది:

ఆఫ్‌ ద రికార్డ్‌ అడిగితే నిజం తెలుస్తుంది:

తాజాగా గేల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇప్పటికీ మిమ్మల్ని చూసి బౌలర్లు భయపడున్నారా? అని ప్రశ్నించగా..? 'యూనివర్స్ బాస్ సామర్థ్యం ఏమిటో వారికి తెలుసు. నా బ్యాటింగ్‌ స్టైల్‌, ఫామ్‌ అందిపుచ్చుకుంటే ఎంతలా హిట్టింగ్‌ చేస్తానో కూడా తెలుసు. అందుకే చాలా మంది బౌలర్లకు నేను క్రీజ్‌లో ఉంటే భయం. ఈ విషయంను వారు కెమెరా ముందు ఒప్పుకోరు. కానీ.. ఆఫ్‌ ద రికార్డ్‌ అడిగితే నిజం చెబుతారు' అని గేల్‌ పేర్కొన్నారు.

ఆటను ఎంజాయ్ చేస్తా:

ఆటను ఎంజాయ్ చేస్తా:

'పేస్ బౌలింగ్‌లో హిట్టింగ్ చేయడానికి ఇష్టపడతా. ఒక బ్యాట్స్‌మన్‌గా సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటా. ఆటను ఎంజాయ్ చేస్తా. మైదానంలో సరదాగా ఉంటా. డ్రెస్సింగ్ రూమ్ కూడా నా ఆటలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కువ సిక్సులు కొట్టమని అభిమానులు అడుగుతుంటారు, వారిని కూడా సంతోషపెట్టాలి. ఇక నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. ప్రపంచకప్‌ను మాత్రం గెలవాలి' అని గేల్‌ తెలిపారు.

ఎప్పుడూ కలలు కనలేదు:

ఎప్పుడూ కలలు కనలేదు:

అంతకుముందు ఇంటర్వ్యూలో గేల్ మాట్లాడుతూ... 'చాలా ప్రపంచకప్‌లలో ఆడాలని నేను ఎప్పుడూ కూడా కలలు కనలేదు. కానీ అలా జరిగిపోతుంది. ఇదంతా నా కెరీర్ స్థిరత్వం వలనే సాధ్యం అవుతోంది. హార్డ్ వర్క్ ఎప్పటికీ ఉపయోగపడుతుంది. గత రెండు నెలలలో విండీస్ బోర్డులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం మంచి జట్టు ఉంది. కరేబియన్ లో క్రికెట్ కు చాలా ఆదరణ ఉంది. వీరిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తా. ఇంగ్లాండ్ జట్టుపై మంచి క్రికెట్ ఆడాం. ప్రపంచకప్‌లో కూడా మంచి ప్రదర్శన చేస్తాం' అని గేల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటా:

ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటా:

మరో ఓ ఇంటర్వ్యూలో క్రిస్‌ గేల్‌ తన ఫిట్‌నెస్‌కు అసలు కారణం చెప్పేసాడు. 'మ్యాచ్‌లకు మధ్య ఉండే సమయాల్లో ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటా. రెండు నెలలుగా జిమ్‌లో అడుగు కూడా పెట్టలేదు. మానసికంగా దృఢంగా తయారవడంపై దృష్టి సారించా. యోగా చేస్తున్నా. మాసాజ్‌లు చేయించుకుంటున్నా. దీంతో మ్యాచ్‌ల ముందు తాజాగా ఉంటా' అని గేల్ తెలిపారు.

Story first published: Wednesday, May 22, 2019, 14:59 [IST]
Other articles published on May 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X