న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాహల్‌ టీవీ.. భారత అభిమానులకు భువనేశ్వర్‌ విజ్ఞప్తి

ICC Cricket World Cup 2019: Bhuvneshwar Kumar has a message for Indian fans on Chahal TV

టీమిండియా స్టార్ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ నిర్వహించే చాహల్‌ టీవీలో భారత క్రికెట్ అభిమానులకు పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ ఓ విజ్ఞప్తి చేసాడు. ప్రపంచకప్‌ టోర్నీ ఆసాంతం తమకు మద్దతుగా నిలవాలని టీమిండియా అభిమానులను భువీ కోరాడు. ఈ మధ్య కాలంలో టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడినా.. మనం చాహల్‌ టీవీని చూస్తున్నాం. ఇందులో చాహల్‌ అందరిని ఇంటర్వ్యూ చేస్తుంటాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అండగా ఉండండి:

అండగా ఉండండి:

టీమిండియా ప్రపంచకప్‌ రెండో వార్మప్‌ మ్యాచ్‌ కోసం లండన్‌ నుంచి కార్డిఫ్‌ వెళ్తుండగా.. చాహల్‌ తన టీవీ షోని కొనసాగించాడు. ఈ సందర్భంగా పలువురు టీమిండియా క్రికెటర్లు చాహల్‌ షోలో పాల్గొని తమ మనసులోని మాటలను పంచుకున్నారు. భువనేశ్వర్‌ మాట్లాడుతూ.. 'ప్రపంచకప్‌లో అందరం మంచి ప్రదర్శన చేస్తాం. టోర్నీ ఆసాంతం తమకు మద్దతుగా నిలవాలి' అని భువీ అభిమానులను కోరాడు.

ప్రపంచకప్‌ సాధిస్తాం:

ఓపెనర్, గబ్బర్ శిఖర్‌ ధావన్‌ మాట్లాడుతూ... 'ఇంగ్లాండ్‌లో ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు అనేక ఐసీసీ ఈవెంట్లలో పాల్గొన్నాను. అప్పుడు బాగా రాణించా. గత విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రపంచకప్‌ సాధిస్తాం' అని ధావన్‌ పేర్కొన్నాడు. రోహిత్ మాట్లాడుతూ... 'బస్సుల్లో నీతో ఇలా లండన్‌ నుంచి కార్డిఫ్‌ వెళ్లడం సంతోషంగా ఉంది' అని అన్నారు.

చాలా పెద్ద విషయం:

చాలా పెద్ద విషయం:

వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ మాట్లాడుతూ... 'చాహల్‌ టీవీ ద్వారా మీ ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ షోలో పాల్గొనడం అంత సులువు కాదు. ఇది చాలా పెద్ద విషయం' అని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు చాహల్‌ టీమిండియాలోని అందరి సభ్యులను ఇంటర్వ్యూ చేసాడు. తాజాగా రోహిత్ కూడా జాదవ్, జడేజాలను ఇంటర్వ్యూ చేసాడు.

రెండో వార్మప్‌ మ్యాచ్‌:

రెండో వార్మప్‌ మ్యాచ్‌:

టీమిండియా తొలి వార్మప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో 6 వికెట్లతో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఈ రోజు మధ్యాహ్నం కార్డిఫ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో రెండో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌తో అందరూ గాడిలో పడాలని చూస్తున్నారు. జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో టీమిండియా ప్రపంచకప్‌ తొలి మ్యాచ్ ఆడనుంది.

Story first published: Tuesday, May 28, 2019, 11:38 [IST]
Other articles published on May 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X