న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్గాన్‌పై బంగ్లా విజయం.. సెమీస్‌ ఆశలు సజీవం

ICC Cricket World Cup 2019 : Bangladesh Defeat Afghanistan By 62 Runs || Match Highlights
ICC Cricket World Cup 2019, Bangladesh vs Afghanistan: Shakib Al Hasan fifty, 5-wicket haul help Bangladesh defeat Afghanistan by 62 runs

ఆల్‌రౌండ్‌ షోతో ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ అదరగొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పటిష్ట భారత్‌ను వణికించిన అఫ్ఘానిస్థాన్‌ను బంగ్లాదేశ్‌ మట్టికరిపించింది. మొదటగా బ్యాట్స్‌మెన్‌ పట్టుదలతో ఆడి మెరుగైన స్కోరు అందిస్తే.. ఆ తర్వాత బౌలర్లు అఫ్గాన్‌ను చుట్టేశారు. ఈ గెలుపుతో సెమీస్‌పై ఆశలు పెంచుకున్న బంగ్లా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్‌ తర్వాతి స్థానంకు చేరుకుంది. దీంతో సెమీస్ రేసును మరింత ఆసక్తికరంగా మార్చింది. మరోవైపు అఫ్గాన్‌కు ఈ ప్రపంచకప్‌లో వరుసగా ఏడో ఓటమి. ఆ జట్టు ఎప్పుడో సెమీస్ రేసు నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సోమవారం అఫ్గాన్‌పై బంగ్లా 62 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట ముష్ఫికర్‌ రహీమ్‌, షకిబ్‌ అల్‌హసన్‌ (51 69 బంతుల్లో 1×4) రాణించడంతో బంగ్లా 50 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. అనంతరం షకిబ్‌ (5/29), ముస్తాఫిజుర్‌ (2/32)ల ధాటికి అఫ్గాన్‌ 47 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. గుల్బాదిన్‌ నైబ్‌ (47), షెన్వారి (49) మాత్రమే రాణించారు. షకీబల్‌ హసన్‌ బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీతో పాటు బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు.

తొలి వికెట్‌కు 49 పరుగులు:

తొలి వికెట్‌కు 49 పరుగులు:

లక్ష్య ఛేదనను అఫ్ఘాన్‌ జట్టు ఆత్మవిశ్వాసంతోనే ఆరంభించింది. ఓపెనర్లు రహ్మత్‌ షా (24), నయీబ్‌ (75 బంతుల్లో 47; 3 ఫోర్లు) 10 ఓవర్ల పాటు నిలదొక్కుకుని మొదటి వికెట్‌కు 49 పరుగులు జత చేశారు. షకీబ్‌ తన తొలి ఓవర్‌లోనే రహ్మత్‌షాను అవుట్‌ చేశాడు. తర్వాత వచ్చిన హష్మతుల్లా షాహిది (11) మొసద్దిక్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.

షకీబ్‌ మాయ:

షకీబ్‌ మాయ:

అస్గర్‌ (38 బంతుల్లో 20; 1 ఫోర్‌) అండతో కెప్టెన్‌ నైబ్‌ జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. అర్ధ సెంచరీ దిశగా సాగుతున్న నైబ్‌నూ, హార్డ్‌ హిట్టర్‌ నబీ (0)ని ఒకే ఓవర్లో షకీబ్‌ పెవిలియన్‌ చేర్చడంతో అఫ్గాన్‌ కష్టాల్లో పడింది. ఆ తర్వాత మరో కీలక ఆటగాడు అస్ఘర్‌ (20) ను కూడా అతడే అవుట్‌ చేశాడు. 117 పరుగులకే ఐదో వికెట్‌ను కోల్పోయి అఫ్గాన్‌ కోలుకోలేకపోయింది.

ఒంటరి పోరాటం:

ఒంటరి పోరాటం:

ఈ సమయంలో సమీయుల్లా షిన్వరీ (51 బంతుల్లో 49 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), నజీబుల్లా (23) ఏడో వికెట్‌కు 56 పరుగులు జోడించగలిగారు. షకీబల్‌ తన ఐదో వికెట్‌గా నజీబుల్లాను అవుట్‌ చేయడంతో షిన్వరీ ఒంటరి పోరాటం చేసాడు. చివర్లో పేసర్‌ ముస్తాఫిజుర్‌ మిగతా వికెట్లు తీయడంతో ఆఫ్గాన్ 47 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది.

శుభారంభం దక్కలేదు:

శుభారంభం దక్కలేదు:

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టును ఆరంభంలో అఫ్ఘాన్‌ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. ఓపెనర్లు లిటన్‌ దాస్‌ (16), తమీమ్‌ ఇక్బాల్‌ (53 బంతుల్లో 36; 4 ఫోర్లు) శుభారంభం ఇవ్వలేకపోయారు. దాస్‌ ఔట్‌ కావడంతో తమీమ్‌కు షకీబ్‌ జతయ్యాడు. ఇద్దరు నిలదొక్కుకోవడంతో పరుగుల వేగం పెరిగింది. ఈ దశలో తమీమ్‌ను నబీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

షకీబ్, ముష్ఫికర్‌ షో:

షకీబ్, ముష్ఫికర్‌ షో:

తమీమ్‌ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్‌ రహీమ్, షకీబ్‌తో కలిసి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. షకీబ్‌ 66 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ముజీబ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. షకీబ్, ముష్ఫికర్‌ మూడో వికెట్‌కు 61 పరుగులు జతచేశారు. తర్వాత సౌమ్య సర్కార్‌ (3) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. దీంతో మహ్ముదుల్లా (38 బంతుల్లో 27; 2 ఫోర్లు) అండతో ముష్ఫికర్‌ 56 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. మహ్ముదుల్లాను నైబ్‌ ఔట్‌ చేయడంతో ముష్ఫికర్‌కు మొసద్దిక్‌ హొస్సేన్‌ (35) జతయ్యాడు. ఇద్దరు స్కోరును 250 దాటించి ఔట్ అయ్యారు.

Story first published: Tuesday, June 25, 2019, 8:29 [IST]
Other articles published on Jun 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X