న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాపై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్‌

ICC Cricket World Cup 2019, Bangladesh vs Afghanistan: Afghanistan have won the toss and have opted to field

ప్రపంచకప్‌లో భాగంగా సౌథాంప్టన్‌ వేదికగా మరికొద్ది సేపట్లో అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్‌ కెప్టెన్ గుల్బదిన్ నయిబ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు రెండు మార్పులు చేసింది. దవ్లత్, షెన్వారీలు అఫ్గానిస్థాన్‌ జట్టులోకి వచ్చారు. సైఫుద్దీన్, మోసదేక్ బంగ్లా తీసుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ పరాజయం పాలవడంతో బంగ్లా సెమీస్‌పై ఆశలు మెరుగయ్యాయి. భారీ ఓటమితో ఏ మ్యాచ్ ఆడకపోవడంతో నెట్‌ రన్‌రేట్‌ కూడా బాగానే ఉంది. ప్రస్తుతం బంగ్లా పాయింట్ల పట్టికలో ఐదు పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచులలో (అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌, భారత్‌) గెలిస్తే సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో బంగ్లా-అఫ్గాన్‌ పోరు ఆసక్తికరంగా మారింది. మరోవైపు వరుస ఆరు పరాజయాలతో అఫ్గానిస్థాన్‌ టోర్నీ నుండి నిష్క్రమించింది.

1
43674

ఇరు జట్లు 7 సార్లు వన్డేల్లో తలపడగా.. 4 సార్లు బంగ్లాదేశ్‌ గెలిచింది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో అఫ్గాన్‌ విజయం సాధించింది. ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఒకసారి మాత్రమే తలపడ్డాయి. అందులో బంగ్లాదేశ్‌ విజయాన్ని అందుకుంది. 2015 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ 105 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై విజయం సాధించింది. అయితే బంగ్లాదేశ్‌కు షాకిచ్చి టోర్నీలో బోణీ కొట్టడానికి అఫ్గాన్‌ సిద్ధమైంది.

Teams:

Afghanistan: Gulbadin Naib(c), Rahmat Shah, Hashmatullah Shahidi, Asghar Afghan, Mohammad Nabi, Najibullah Zadran, Samiullah Shinwari, Ikram Ali Khil(w), Rashid Khan, Dawlat Zadran, Mujeeb Ur Rahman.

Bangladesh: Tamim Iqbal, Soumya Sarkar, Shakib Al Hasan, Mushfiqur Rahim(w), Liton Das, Mahmudullah, Mosaddek Hossain, Mohammad Saifuddin, Mehidy Hasan, Mashrafe Mortaza(c), Mustafizur Rahman.

Story first published: Monday, June 24, 2019, 15:07 [IST]
Other articles published on Jun 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X