ప్రపంచకప్‌.. బంగ్లాను లంక నిలువరించేనా?

ICC Cricket World Cup 2019, BAN vs SL: Bangladesh vs Sri Lanka Probable XI, Team News, Pitch Report, Key Stats, When and Where to Watch

ప్రపంచకప్‌ భాగంగా మంగళవారం బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రీలంక మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఒకదాంట్లో విజయం సాధించి మరొక దాంట్లో ఓడింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దయింది. మరోవైపు బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఒక విజయం సాధించి రెండింట్లో ఓడిపోయింది. పటిష్ట దక్షిణాఫ్రికాను ఓడించినా.. కివీస్, ఇంగ్లాండ్ జట్ల చేతిలో ఓడిపోయింది. ఓడినా కూడా బంగ్లా భారీ పరుగులే చేసింది. ఈ రోజాటి మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

 బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం:

బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం:

న్యూజీలాండ్ మ్యాచ్‌లో కెప్టెన్‌ కరుణరత్నే మినహా ఎవ్వరూ పరుగులు చేయలేదు. ఎనిమిది మంది బ్యాట్స్‌మన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆఫ్గాన్ మ్యాచ్‌లో కుషాల్ పెరీరా మెరిశాడు. ఈ నేపథ్యంలో మాథ్యూస్‌, తీసారా పెరీరా, తిరిమన్నే, మెండిస్, డిసిల్వాలు రాణించాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్‌లో లంక ఆశలన్నీ సీనియర్‌ పేసర్‌ మలింగపైనే. కానీ అతను కేవలం 3 వికెట్లే తీసి.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో లంక పరిస్థితి ఘోరంగా మారింది. అయితే ప్రదీప్ ఫామ్ లంకకు కలిసొచ్చే అంశం. ప్రదీప్, మలింగ రాణిస్తే ఆరంభంలో వికెట్లు తీసి బ్యాట్స్‌మన్‌లపై ఒత్తిడి పెంచొచ్చు. వీరికి తోడు లక్మల్, ఉడనాలు రాణిస్తే తిరుగుండదు.

ఫామ్‌లో బంగ్లా బ్యాట్స్‌మన్‌:

ఫామ్‌లో బంగ్లా బ్యాట్స్‌మన్‌:

బంగ్లా బ్యాట్స్‌మన్‌ అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. అన్ని మ్యాచులలో సమిష్టిగా రాణించారు. ముఖ్యంగా షకిబ్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో అదరగొట్టాడు. తమీమ్ ఇక్బాల్, మొహమ్మదుల్లా, ముష్పికర్ రహీం, సౌమ్యా సర్కార్, షబ్బీర్ రెహమాన్ ఇప్పటికే బ్యాట్ జులిపించారు. వీరు రాణిస్తే లంకకు కష్టాలు తప్పవు. కెప్టెన్‌ మష్రాఫె మొర్తజా విఫలమయినా.. సైఫుద్దీన్, హాసన్ రాణిస్తున్నారు. ఇక ప్రాధాన పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్, షకిబ్‌ ఫామ్ అందుకుంటే బంగ్లాకు విజయం సులువే.

బంగ్లాకే విజయావకాశాలు ఎక్కువ:

బంగ్లాకే విజయావకాశాలు ఎక్కువ:

ఇప్పటివరకు లంక, బంగ్లాలు 43 వన్డేలు ఆడాయి. వీటిలో 36 లంక గెలిస్తే.. 7 బంగ్లా నెగ్గింది. ఇక ప్రపంచకప్‌లో ఇరు జట్లు మూడు సార్లు తలపడగా.. మూడు మ్యాచ్‌ల్లో లంకే గెలిచింది. రికార్డులు లంకకు అనుకూలంగా ఉన్నా.. లంక పరిస్థితి ఇపుడు ఏమంత బాగాలేదు. లంక బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తడబడుతుండడంతో.. బంగ్లాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ జరగనుంది.

Sri Lanka:

Sri Lanka:

Teams (Possible XI):Dimuth Karunaratne, Kusal Perera, Lahiru Thirimanne, Kusal Mendis, Angelo Mathews, Dhananjaya de Silva, Thisara Perera, Jeevan Mendis, Isuru Udana, Suranga Lakmal, Lasith Malinga

Bangladesh

Bangladesh

Teams (Possible XI): Tamim Iqbal, Soumya Sarkar, Shakib Al Hasan, Mushfiqur Rahim, Mohammad Mithun, Mahmudullah, Mosaddek Hossain, Mashrafe Mortaza, Mehidy Hasan, Rubel Hossain, Mustafizur Rahman.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, June 11, 2019, 12:37 [IST]
Other articles published on Jun 11, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more