న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫైనల్ ఆసీస్‌-భారత్‌ మధ్యే.. కానీ క్రికెట్‌కు ఇది మంచిది కాదు

ICC Cricket World Cup 2019: Australia India final is likely and thats not good for the game says Ian Chappell

ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతుంది. కానీ.. క్రికెట్‌కు ఇది మంచిది కాదు అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్‌ ఛాపెల్‌ అభిప్రాయపడ్డాడు. అందరూ అనుకున్నట్లుగానే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్లు లీగ్ దశలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచి సెమీస్‌కు చేరాయి. ప్రపంచకప్‌ సెమీస్‌ సమరానికి ముందు క్రికెటర్లు, విశ్లేషకుల అంచనాలు జోరందుకున్నాయి. సెమీస్‌ మ్యాచులకు ముందే ఫైనల్లో తలపడే జట్లు ఇవే అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్‌ ఛాపెల్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'అద్భుతమైన ఆటతో టోర్నీలో మంచి ప్రదర్శన చేసి నాలుగు జట్లు సెమీస్ చేరాయి. నెల రోజులకు పైగా సాగుతున్న ఈ టోర్నీలో ఆశించినంత కొత్తదనం కనిపించలేదు. ఎలాంటి సంచనాలు జరగలేదు. అందరూ ఊహించిన విధంగానే ఆ జట్లే లీగ్ టాపర్లుగా నిలిచాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్‌కు ఇది అంత మంచిది కాదు. మిగతా జట్లు కూడా కప్ కొట్టాలి' అని అన్నారు.

'ఆస్ట్రేలియా మళ్లీ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. దేశం పరంగా చూసుకుంటే ఇది ఆనందించాల్సిన విషయమే. కానీ ఆట విషయంలో కాదు. టీమిండియా కూడా సెమీస్‌ చేరింది. కివీస్‌ గత టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఇంగ్లాండ్‌ 1992 తర్వాత మళ్లీ సెమీస్‌ గడప తొక్కడం శుభపరిణామమే. ప్రస్తుతం వీటి మధ్య ఫైనల్‌ పోరుతో అంత ఉత్కంఠ కనిపించకపోవచ్చు' అని పేర్కొన్నారు.

'ఇప్పటివరకూ ప్రపంచకప్‌ టోర్నీల్లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. 2007లో 16 జట్లు.. 2011, 2015లో 14 జట్లు ఆడాయి. ఇప్పుడు 10 జట్లు మాత్రమే ఆడుతున్నాయి. జట్ల సంఖ్య తగ్గుతుండటం క్రికెట్‌కు మంచిది కాదు. ఐసీసీ ఈ విషయంలో దృష్టి పెట్టాలి. చిన్న జట్లను ప్రోత్సహించాలి. బలమైన జట్లతో నిత్యం టోర్నీలు నిర్వహిస్తుండాలి. అవి కూడా ఎదిగేలా అవకాశాలు కల్పించాలి. అప్పుడే సరికొత్త సంచలనాలకు చోటు ఉంటుంది' ని అని ఛాపెల్‌ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, July 8, 2019, 16:49 [IST]
Other articles published on Jul 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X