న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్‌తో భారత్ తొలి మ్యాచ్: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

By Nageshwara Rao
ICC confirm schedule for Womens T20 World Cup

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో మరో మహా సమరానికి త్వరలో తెరలేవనుంది. మహిళల టీ20 వరల్డ్ కప్‌కి సంబంధించిన షెడ్యూల్‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. నవంబర్‌లో 9 నుంచి 24 వరకు జరిగే ఈ మెగా టోర్నీకి వెస్టిండిస్ ఆతిథ్యమివ్వనుంది.

టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌, మూడు సార్లు ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా, ఐసీసీ మహిళ వరల్డ్ కప్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో సహా ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా ఇలా పది దేశాలు టోర్నీలో పాల్గొనున్నాయి.

కరేబియన్ గడ్డపై మొత్తం మూడు వేదికల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. అంతకు ముందు ఈ టోర్నమెంట్‌ కోసం జరిగే క్వాలిఫయర్ మ్యాచ్‌లు జూలై 7 నుంచి 14 వరకూ నెదర్లాండ్స్‌లో జరుగుతాయి. క్వాలిఫయర్స్ టోర్నీలో బంగ్లాదేశ్, ఐర్లాండ్, ది నెదర్లాండ్స్, పపువా న్యూ గినియా, స్కాట్‌ల్యాండ్, థాయ్‌ల్యాండ్, ఉగాండ, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు పాల్గొంటాయి.

ఇందులో క్వాలిఫై అయిన రెండు దేశాలతో రెండు గ్రూప్‌లను ఏర్పాటు చేశారు. గ్రూప్‌-ఏలో వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్-1 జట్లు ఉండగా... గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇండియా, క్వాలిఫయర్-2 జట్లు ఉన్నాయి.

నవంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తొలిసారి డీఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. టోర్నీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌ని న్యూజిలాండ్‌తో ఆడనుంది. నవంబర్ 22న జరిగే సెమీ ఫైనల్స్‌తో పాటు 24న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లకు ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

Group A:
West Indies, South Africa, England, Sri Lanka, Qualifier 1

Group B:
Australia, India, New Zealand, Pakistan, Qualifier 2

Proteas women WT20 schedule:
Monday, November 12 - SA v Sri Lanka
Wednesday, November 14 - SA v West Indies
Friday, November 16 - SA v England
Sunday, November 18 - SA v Qualifier 1

Story first published: Monday, June 25, 2018, 17:35 [IST]
Other articles published on Jun 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X