న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిషేధం ఎత్తివేత: పాక్‌ బౌలర్‌కు మహమ్మద్ హఫీజ్‌కు ఊరట

By Nageshwara Rao
ICC Clears Pakistans Mohammad Hafeez To Bowl With Remodelled Action

హైదరాబాద్: బౌలింగ్‌ యాక్షన్‌ సరిగా లేని కారణంగా నిషేదం ఎదుర్కుంటున్న పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ మహమ్మద్ హఫీజ్‌కు గొప్ప ఊరట లభించింది. అతడు తన బౌలింగ్‌ యాక‌్షన్‌‌ను మార్చుకున్న నేపథ్యంలో అతడిపై ఉన్న నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

గతేడాది అక్టోబర్‌లో అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరిస్‌లో 37 ఏళ్ల మహమ్మద్ హఫీజ్‌ బౌలింగ్ యాక్షన్‌పై అంఫైర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హఫీజ్‌ బంతులను వేసే సమయంలో తన మోచేతిని 15 డిగ్రీలకన్నా ఎక్కువగా వంచుతున్నాడని ఇది ఐసీసీ బౌలింగ్‌ నిబంధనలకు విరుద్దమని హఫీజ్‌పై మూడు సార్లు ఐసీసీ నిషేధం విధించింది.

తాజాగా తన బౌలింగ్‌ శైలిని మార్చుకున్న హఫీజ్‌ ఇటీవల ఐసీసీ ముందు హాజరయ్యాడు. ఏప్రిల్ 17న లండన్‌లోని లౌబరౌఫ్ యూనివర్సిటీలో హఫీజ్ బౌలింగ్‌ యాక‌్షన్‌ను పరీక్షించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. హఫీజ్‌ తన బౌలింగ్‌ యాక్షన్‌ను భవిష్యత్తులో​ మార్చడని అధికారులు విశ్వాసం వ్యక్తం చేసినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

హఫీజ్‌ తాజా బౌలింగ్‌ యాక‌్షన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం ఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. డిసెంబర్ 2014లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన టెస్టు సిరిస్‌లో తొలిసారి హఫీజ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.

ఆ తర్వాత తన బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకోవడంతో ఏప్రిల్ 2015న అతడిపై ఉన్న నిషేధాన్ని ఐసీసీ ఎత్తి వేసింది. మళ్లీ జులై 2015లో అతడి బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు అందడంతో 12 నెలలు పాటు నిషేధం విధించింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ ప్రదర్శనకు వెళ్తోన్న పాకిస్థాన్ టెస్టులో జట్టు హఫీజ్‌కు చోటు దక్కలేదు.

Story first published: Wednesday, May 2, 2018, 18:49 [IST]
Other articles published on May 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X