న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ అత్యవసర సమావేశం.. పాల్గొన్న గంగూలీ!!

ICC Board discusses contingency plan, Ganguly represented BCCI

దుబాయ్: ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా క్రికెట్‌ సిరీస్‌లు అన్ని వాయిదా పడ్డాయి. వచ్చే అక్టోబర్ నెలలో ఆసీస్ గడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్‌, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టోర్నీలపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో అత్యవసర ప్రణాళికలపై సభ్య దేశాలతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశం నిర్వహించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి బీసీసీఐ ప్రతినిధిగా అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పాల్గొన్నారు.

కరోనా కోసం జొకోవిచ్‌ భారీ విరాళం.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?!!కరోనా కోసం జొకోవిచ్‌ భారీ విరాళం.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?!!

అత్యవసర ప్రణాళిక:

అత్యవసర ప్రణాళిక:

కరోనా ప్రభావం అంతర్జాతీయంగా క్రీడలపై ఎలా ఉందో చర్చించామని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 'సమగ్ర వ్యాపార కొనసాగింపు, అత్యవసర ప్రణాళిక గురించి సమావేశంలో అందరం చర్చించాం. ఐసీసీ టోర్నీలకు సంబంధించి అత్యవసర ప్రణాళిక నిర్వహణ గురించి సభ్య దేశాల అభిప్రాయాలను అడిగాం. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా టోర్నీలు నిర్వహించొచ్చో పరిశీలించాలని కోరాం' అని ఐసీసీ సీఈవో మను సాహ్నీ తెలిపారు.

పాయింట్ల పంపకం ఎలాగంటే:

పాయింట్ల పంపకం ఎలాగంటే:

పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ జట్లు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉంది. కరోనా పంజా విసురుతున్న ఈ కఠిన పరిస్థితుల్లో ఇవి రద్దైతే పాయింట్లను ఎలా పంచుతారని ఓ బోర్డు అధికారి ప్రశ్నించగా.. సాంకేతిక కమిటీ దృష్టికి తీసుకెళ్తామని ఐసీసీ తెలిపింది. 'అందరికీ అంగీకారయోగ్యమైన పరిష్కారం లభించకపోతే సమస్యను సాంకేతిక కమిటీ దృష్టికి తీసుకెళ్తాం. టీమిండియా ఇప్పటికే ఆరు సిరీస్‌లు ఆడి అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్‌ మూడు సిరీస్‌లు ఆడాలి. పాయింట్ల పంపకం గురించి సాంకేతిక కమిటీ చూసుకుంటుంది' అని ఓ ప్రతినిధి తెలిపారు.

 ప్రపంచకప్‌ గురించి ఆలోచించలేదు:

ప్రపంచకప్‌ గురించి ఆలోచించలేదు:

టీ20 ప్రపంచకప్‌ గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించలేదని ఐసీసీ తెలిపింది. జూన్‌, జులై వరకు కరోనా సమస్య తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. లేదంటే అత్యవసర ప్రణాళికపై దృష్టిసారిస్తామని వెల్లడించింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌కి ఆతిథ్యమివ్వడంపై స్పష్టత ఇవ్వలేకపోతోంది. దీంతో పునాలోచనలో పడిన ఐసీసీ.. ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని చూస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Story first published: Saturday, March 28, 2020, 11:21 [IST]
Other articles published on Mar 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X