న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో ఎక్కువ పరుగులిచ్చిన బౌలర్‌ ఎవరు.. ఐసీసీ పోస్టుకు బ్రాడ్‌ సరదా కామెంట్‌!!

ICC asks to guess the bowler who conceded most runs in an over in T20Is; Stuart Broad responds

లండన్: న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఐదో టీ20ని గెలిచిన భార‌త్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల‌కు 163 ప‌రుగులు చేసింది. అనంత‌రం లక్ష్య ఛేద‌నలో కివీస్ 9 వికెట్ల‌కు 156 ప‌రుగులు చేసి ప‌రాజ‌యం పాలైంది. ఈ మ్యాచ్‌లో భార‌త ఆల్‌రౌండర్‌ శివ‌మ్ దూబే బంతి, బ్యాట్‌తోనూ పూర్తిగా నిరాశ‌ప‌ర్చాడు. మొదటగా బ్యాటింగ్‌లో 5 ప‌రుగులు చేసిన దూబే.. ఆ తర్వాత బంతితో ఒక ఓవ‌ర్లో ఏకంగా 34 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

రాహుల్‌కు షాక్.. సైనీ, అగర్వాల్‌కు చోటు.. భారత టెస్టు జట్టు ఇదే!!రాహుల్‌కు షాక్.. సైనీ, అగర్వాల్‌కు చోటు.. భారత టెస్టు జట్టు ఇదే!!

దూబే చెత్త రికార్డు:

దూబే చెత్త రికార్డు:

ఒక ఓవ‌ర్లో ఏకంగా 34 ప‌రుగులు ఇవ్వడంతో దూబే ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ తరఫున ఏ ఫార్మాట్లో అయినా ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో కివీస్ ఆటగాళ్లు టిమ్‌ సీఫెర్ట్‌, రాస్‌ టేలర్‌ విజృంభించి ఆడి 34 ప‌రుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సరదా ప్రశ్న వేసింది.

అర్రే నాకు తెలీదే:

'6, 6 , 4 ,1 , 4నోబ్‌, 6, 6 = 34 పరుగులు. శివమ్‌ దూబే టీ20 చరిత్రలో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. టీ20ల్లో అత్యధిక పరుగుకు ఇచ్చిన తొలి బౌలర్‌ ఎవరో గుర్తుందా?' అని ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను ప్రశ్నించింది. ఐసీసీ అడిగిన ప్రశ్నకు ఇంగ్లీష్ సీనియర్ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ అంతే సరదాగా సమాధానం ఇచ్చాడు. 'ఎక్కువ పరుగులిచ్చిన తొలి బౌలర్‌ ఎవరో నాకు తెలీదు' అని రాసుకొచ్చాడు.

బ్రాడ్‌ను మరే బౌలర్ దాటాడేమో?:

బ్రాడ్‌ను మరే బౌలర్ దాటాడేమో?:

2007 టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా స్టువర్ట్‌ బ్రాడ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఒకే ఓవర్‌లో మొత్తం ఆరు సిక్సులు బాదడంతో..ఏకంగా 36 పరుగులు వచ్చాయి. అలా టీ20 క్రికెట్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ ఎక్కువ పరుగులిచ్చిన బౌలర్‌గా తొలి స్థానంలో నిలిచాడు. నాటి మ్యాచ్‌లో యువరాజ్‌ కొట్టిన సిక్సులు భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. బహుశా బ్రాడ్‌ను మరే బౌలర్ దాటే అవకాశం ఉండదేమో!! ఒకవేళ నోబాల్స్ వేస్తే తప్ప.

తొలి భార‌త బౌల‌ర్‌గా దూబే:

తొలి భార‌త బౌల‌ర్‌గా దూబే:

టీ20 ఫార్మాట్‌లో అత్య‌ధిక ప‌రుగులిచ్చిన భార‌త బౌల‌ర్‌గా దూబే చెత్త రికార్డును ఖాత‌లో వేసుకున్నాడు. గ‌తంలో ఈ రికార్డు స్టువ‌ర్ట్ బిన్నీ పేరిట ఉండేది. 2016లో అమెరికా లాడ‌ర్‌హిల్స్‌లో వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బిన్నీ 32 ప‌రుగులిచ్చాడు. త‌ర్వాతి స్థానంలో భార‌త ఆల్‌రౌండ‌ర్ సురేశ్ రైనా ఉన్నాడు. 2012లో జోహెన్నెస్‌బ‌ర్గ్‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో రైనా 26 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

Story first published: Tuesday, February 4, 2020, 11:26 [IST]
Other articles published on Feb 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X