న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంక టీమ్ విశ్లేషణ: గతమెంతో ఘనం... ఈసారి పోటీనిచ్చేనా?

ICC 2019 World Cup: Sri Lanka squad and player analysis

హైదరాబాద్: శ్రీలంక... ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన జట్టు. అప్పటి వరకు నెమ్మదిగా సాగిన వన్డే క్రికెట్‌కు దూకుడుని పరిచయం చేశారు. ఓ అనామక జట్టుగా 1996 టోర్నీలో బరిలోకి దిగి అద్భుతం చేసింది. ఎవరూ ఊహించని విధంగా అందరి అంచనాలను తలక్రిందులు చేసిన ప్రపంచ‌కప్ విజేతగా నిలిచింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే ఆ తర్వాత నుంచి లంకేయుల నుంచి ఆ స్థాయి మెరుపులు రాలేదు. 2007, 2011లో మాత్రం ఫైనల్‌దాకా చేరినప్పటికీ రన్నరప్‌గా నిలిచింది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌ బరిలో దిగుతోన్న అన్ని జట్లూ స్టార్‌ ప్లేయర్లతో కళకళలాడుతుండగా... శ్రీలంక జట్టు పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది.

గత రెండేళ్లలో ఒక్క ద్వైపాక్షిక సిరిస్‌ గెలవలేదు

గత రెండేళ్లలో ఒక్క ద్వైపాక్షిక సిరిస్‌ గెలవలేదు

ఈ వరల్డ్‌కప్‌లో ఆ జట్టుని ముందుండి నడిపించే నాయకుడే కనిపించడం లేదు. అలాగే, వరల్డ్‌కప్‌లో లంకను ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉన్న నాయకుడే కనిపించడం లేదు. మాజీ క్రికెట్ దిగ్గజాలు కుమార సంగక్కర, మహేల జయవర్ధనె లాంటి ఆటగాళ్లు వీడ్కోలు పలకడంతో వారి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు ఇంతవరకు కనిపించడం లేదు. 2017లో జింబాబ్వేతో స్వదేశంలోనే జరిగిన ఐదు వన్డేల సిరిస్‌ను 3-2తో కోల్పోయింది. చెప్పాలంటే గత రెండేళ్లలో శ్రీలంక ఒక్క ద్వైపాక్షిక సిరిస్‌లో కూడా విజయం సాధించింది.

శ్రీలంక బలాలు

శ్రీలంక బలాలు

పేసర్ లసిత్ మలింగకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్. ఈ నేపథ్యంలో జట్టులో అతడే ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మలింగ సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌ 12వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. డెత్‌ ఓవర్లలో మలింగను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సవాలే. తన అనుభవంతో వరల్డ్‌కప్‌లో లంకను విజేతగా నిలిపితే అతడి కెరీర్‌కు ఘనమైన ముగింపు లభించినట్టవుతుంది. ఇక, బ్యాటింగ్‌లో ఏంజెలో మాథ్యూస్‌, కుశాల్‌ మెండిస్‌, కుశాల్‌ పెరీరా చక్కటి ఫామ్‌లో ఉన్నారు.

శ్రీలంక బలహీనతలు

శ్రీలంక బలహీనతలు

ఇటీవలి కాలంలో జట్టులో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని ప్రభావం జట్టుపై చూపుతోంది. కెప్టెన్సీ కూడా మాథ్యూస్‌ నుంచి దినేశ్‌ చండిమాల్‌కు అతడి నుంచి మలింగకు మారింది. అయితే, చివరకు 2015లో చివరి వన్డే ఆడిన ఓపెనర్‌ దిముత్‌ కరుణరత్నెకు బాధ్యతలు అప్పగించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

వరల్డ్ కప్‌లో ఆడే జట్టు

వరల్డ్ కప్‌లో ఆడే జట్టు

దిముత్‌ కరుణరత్నె (కెప్టెన్‌), ఆవిష్క ఫెర్నాండో, తిరిమన్నె, కుశాల్‌ మెండిస్‌, కుశాల్‌ పెరీరా, ధనంజయ డిసిల్వా, జీవన్‌ మెండిస్‌, మిలింద సిరివర్ధన, ఏంజెలో మాథ్యూస్‌, తిసార పెరీరా, ఇసురు ఉదాన, మలింగ, సురంగ లక్మల్‌, జెఫ్రీ వాండర్సే, నువాన్‌ ప్రదీప్‌.

వరల్డ్‌కప్‌లో లంక ఉత్తమ ప్రదర్శన

వరల్డ్‌కప్‌లో లంక ఉత్తమ ప్రదర్శన

విజేత: 1996;

రన్నరప్‌: 2007, 2011

Story first published: Friday, May 24, 2019, 12:16 [IST]
Other articles published on May 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X