న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రిస్ గేల్‌పై ప్రపంచవ్యాప్తంగా నిషేధించాలి: ఇయాన్ పైర్

By Srinivas

సిడ్నీ: బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ సందర్భంగా టీవీ జర్నలిస్ట్ మెల్ మెక్‌లాలిన్‌తో అసభ్యంగా మాట్లాడిన వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ పైన ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఓ ప్రతిపాదన చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియాకు సూచించాడు.

క్రిస్ గేల్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదన్నాడు. ఈ విషయంలో సహనంతో ఉండాల్సిన అవసరం లేదన్నాడు. ఆస్ట్రేలియాలోని ఏ క్లబ్బూ అతనితో ఇక కాంట్రాక్టు కుదుర్చుకోకూడదని 'క్రికెట్ ఆస్ట్రేలియా' నిర్ణయిస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు.

Ian Chappell calls for wordwide ban on Chris Gayle

అలాగే ఐసీసీకి ఈ మేరకు లేఖ రాసినా ఫరవాలేదన్నాడు. లేకుంటే వేర్వేరుగా అన్ని దేశాలకు ఈ విషయం చెప్పాలన్నాడు. గేల్‌కు కేవలం రూ.6 లక్షల జరిమానాతో సరిపెట్టడం సరికాదన్నాడు.

తాను ఏ మహిళతో మాట్లాడినా ఒకేలాంటి సమాధానం వచ్చిందని, అందరూ అతనిపై నిషేధం విధించాలనే కోరారని చెప్పాడు. క్రిస్ గేల్ తరుచూ ఇలా చేస్తూనే ఉంటాడని, అందువల్ల అతడి పైన ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధిస్తే అది యువ క్రికెటర్లకు గట్టి సందేశం ఇచ్చినట్లు అవుతుందన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X