న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లో కుల్దీప్‌కు చోటు అనుమానమే, పంత్ గేమ్ చేంజర్..??

I would play Kuldeep Yadav over other spinners: Dilip Vengsarkar

హైదరాబాద్: ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో మొదలుకానున్న టెస్టు సిరీస్ తుది జట్టు ఎంపిక కోసం టీమిండియా మల్లగుల్లాలు పడుతోంది. బ్యాట్స్‌మెన్ విషయం అటుంచితే.. బౌలర్ల ఎంపిక విషయంలోనూ అదే స్థాయిలో సందిగ్ధత నెలకొంది. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ముగిసిన టీ20, వన్డే సిరీసుల్లో తనదైన ప్రత్యేక బౌలింగ్‌ ప్రదర్శనతో ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్లను బోల్తా కొట్టించాడు కుల్‌దీప్‌ యాదవ్‌.

1
42374
కుల్‌దీప్‌కు తుది జట్టులో స్థానం..?

కుల్‌దీప్‌కు తుది జట్టులో స్థానం..?

ఇంగ్లాండ్‌తో తొలి మూడు టెస్టుల కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. కానీ, మరోపక్క సీనియర్లైన రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా కూడా జట్టులో ఉన్నారు. వీరిని కాదని కుల్‌దీప్‌కు తుది జట్టులో స్థానం దక్కడం కాస్త అనుమానమే. తాజాగా ఇదే ప్రశ్న భారత జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రికి ఎదురైంది.

కుల్‌దీప్‌కు ఎప్పుడైనా అవకాశం రావొచ్చు:

కుల్‌దీప్‌కు ఎప్పుడైనా అవకాశం రావొచ్చు:

‘కుల్‌దీప్‌కు ఇంగ్లాండ్‌తో టెస్టు ఆడే అవకాశం తప్పకుండా దక్కుతుంది. కానీ, అది ఏ టెస్టులో అనేది కచ్చితంగా చెప్పలేం. అతనికి ఎప్పుడైనా అవకాశం రావొచ్చు. అతనికంటే అనుభవజ్ఞులైన అశ్విన్‌, జడేజా కూడా ఉన్నారు. ఇద్దరు స్పిన్నర్లతో ఆడించాలా ఒక్క స్పిన్నర్‌తో ఆడించాలా అనే అంశం మాకు తలనొప్పిగా మారింది. కుల్‌దీప్‌కు టెస్టు క్రికెట్‌ ఆడిన అనుభవం ఉంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అద్భుతంగా రాణించాడు. కుల్‌దీప్‌ కూడా వికెట్లు తీయాలని బాగా కసితో ఉన్నాడు' అని తెలిపాడు.

రిషబ్‌ పంత్‌.. అతడో గేమ్‌ ఛేంజర్‌

రిషబ్‌ పంత్‌.. అతడో గేమ్‌ ఛేంజర్‌

అనంతరం రిషబ్‌ పంత్‌ ఎంపిక గురించి ప్రశ్నించగా.. అతడో గేమ్‌ ఛేంజర్‌, భారత్‌-ఎ తరఫున ఆడి పరుగులు సాధించాడు, భారత జట్టుకు మరో వికెట్‌ కీపర్‌ అవసరం ఉంది. అందుకే ఎంపిక చేశాం అని బదులిచ్చాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో ఎలాంటి ఆందోళన చెందకుండా, మా బలాలను నమ్ముకుని సహజమైన క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తాం' అని రవిశాస్త్రి చెప్పాడు.

ఓపెనర్ల ఎంపికలోనూ కెప్టెన్ కోహ్లీకి ఇబ్బందులు

ఓపెనర్ల ఎంపికలోనూ కెప్టెన్ కోహ్లీకి ఇబ్బందులు

ఇదే క్రమంలో టీమిండియా బ్యాటింగ్ ఓపెనర్ల ఎంపికలోనూ కెప్టెన్ కోహ్లీకి ఇబ్బందులు తప్పవన్నట్లు కనిపిస్తోంది. మురళీ విజయ్‌ని ఇప్పటికే టెస్టు జట్టుకు ఎంపిక చేయగా, టీ20లో సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్ కూడా తొలి సారి ఇంగ్లాండ్‌తో టెస్టు ఆడేందుకు ఉవ్విళ్లురుతున్నాడు. ఇదిలా ఉంచితే ఫామ్ లేమితో బాధపడుతోన్న ధావన్ పరిస్థితి అటూఇటుగానే ఉంది.

Story first published: Tuesday, July 31, 2018, 15:07 [IST]
Other articles published on Jul 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X