న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్ సింగ్‌కు ఫేర్‌వెల్ మ్యాచ్: బీసీసీఐ మాట తప్పిందా?

Yuvraj Singh Fans Ask BCCI For A Send-Off Match || Oneindia Telugu
I was promised farewell game if failed Yo Yo test: Yuvraj Singh

హైదరాబాద్: యువరాజ్ సింగ్‌కు ఫేర్‌వెల్ మ్యాచ్ విషయంలో ఇచ్చిన మాటను బీసీసీఐ తప్పిందా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. 19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ యో-యో టెస్టు పాసైతే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడే అవకాశం కల్పిస్తామని బీసీసీఐ తనకు మాటిచ్చిందని కానీ దానిని నిర్వర్తించలేకపోయిందని చెప్పాడు. అయితే, యువీకి ఇచ్చిన మాటను బీసీసీఐ ఎందుకు నెరవేర్చలేకపోయిందని నెటిజన్లు మండిపడుతున్నారు.

28 ఏళ్ల తర్వాత భారత్ రెండోసారి వన్డే వరల్డ్‌కప్ అందుకోవడంలో యువరాజ్ సింగ్‌దే కీలకపాత్ర. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ బాదిన సిక్స్‌ అందరికీ గుర్తున్నప్పటికీ... మ్యాచ్‌ను అక్కడి వరకు తెచ్చింది మాత్రం యువరాజే. 2011 వరల్డ్‌కప్‌ టోర్నమెంట్‌లో యువరాజ్ సింగ్ ప్రదర్శన అద్భుతం.

మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డు

మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డు

ఈ టోర్నీలో 90.50 యావరేజితో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డుని అందుకున్నాడు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సహచరులంతా వెనుదిరుగుతున్నా నిలకడగా ఆడుతూ అద్భుత హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

బీసీసీఐ ఫేర్‌వెల్ మ్యాచ్ ఇవ్వకపోవడాన్ని

బీసీసీఐ ఫేర్‌వెల్ మ్యాచ్ ఇవ్వకపోవడాన్ని

అలాంటి యువరాజ్ సింగ్‌కు బీసీసీఐ ఫేర్‌వెల్ మ్యాచ్ ఇవ్వకపోవడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. తన రిటైర్మెంట్ స్పీచ్‌లో దీనిపై యువీ మాట్లాడుతూ "నాకు ఆఖరిసారిగా ఒక మ్యాచ్‌ ఆడే అవకాశం ఇవ్వమని బీసీసీఐలో ఎవరినీ అడగలేదు. ఆఖరి మ్యాచ్‌ అంటూ క్రికెట్‌ ఆడటం నాకు నచ్చదు" అని అన్నాడు.

యో-యో టెస్టు పాస్ కావడం నీ వల్ల కాకపోతే

యో-యో టెస్టు పాస్ కావడం నీ వల్ల కాకపోతే

"యో-యో టెస్టు పాస్ కావడం నీ వల్ల కాకపోతే.. చివరి మ్యాచ్ ఆడేయచ్చు అని బీసీసీఐ నుంచి సమాచారం వచ్చింది. రిటైర్మెంట్ మ్యాచ్ అవసరం లేదు అని నేను అప్పుడే చెప్పేశాను. యో-యో టెస్టు పాస్ కాలేకపోతే నాకు నేనుగా

ఇంటికే వెళ్లిపోతానని చెప్పా. ఆ తర్వాత యో యో టెస్టు పాసైనా మ్యాచ్ అవకాశం మాత్రం ఇవ్వలేదు" అని యువీ వాపోయాడు.

2011 వరల్డ్‌కప్ అనంతరం

2011 వరల్డ్‌కప్ అనంతరం

2011 వరల్డ్‌కప్ అనంతరం యువరాజ్ సింగ్ కెరీర్ డౌన్‌ఫాల్ అయింది. ప్రాణాంతక క్యాన్సర్‌కు అమెరికాలో చికిత్స తీసుకున్న అనంతరం పునరాగమనం చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై ఆడిన ఇన్నింగ్స్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో యువీ 21 బంతుల్లో 11 పరుగులే చేయడం అతడి సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది.

21 బంతుల్లో కేవలం 11 పరుగులు

21 బంతుల్లో కేవలం 11 పరుగులు

ఈ ఇన్నింగ్స్‌పై యువీ సైతం స్పందించాడు. "నా క్రికెట్‌ కెరీర్‌లోనే 2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ అత్యంత క్లిష్టమైన దశ. శ్రీలంకపై 21 బంతుల్లో కేవలం 11 పరుగులు చేశా. దాంతో చాలా కుంగిపోయా. నా కెరీర్‌ ముగిసిందనే అనుకున్నా. కానీ నాపై నమ్మకాన్ని నేనెప్పుడూ కోల్పోలేదు" అని యువరాజ్ సింగ్ తెలిపాడు.

యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ

యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ

జట్టులో యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురవడం కూడా యువీ కెరీర్‌పై ప్రభావం చూపింది. దీంతో జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అవకాశం వచ్చినా యువీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఏది అయితేనేం భారత్‌కు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన క్రికెటర్‌కు బీసీసీఐ ఓ ఫేర్ వెల్ మ్యాచ్ ఇచ్చి ఉంటే బాగుండేది.

Story first published: Tuesday, June 11, 2019, 13:04 [IST]
Other articles published on Jun 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X