'వాళ్ల ముగ్గురికీ బౌలింగ్ చేయాలనుంది'

Posted By: Subhan
I'm the softest guy you can meet off the field: Andre Nel

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్ జట్టు సఫారీలను ముచ్చెమటలు పట్టిస్తోంది. దానికి తగ్గట్టు స్థాయిలో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీనే ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో భారత బ్యాట్స్ మెన్లే టార్గెట్ గా ప్రాక్టీస్ చేశారు సఫారీ బౌలర్లు. అయితే సఫారీ జట్టు మాజీ బౌలర్ ఒకరు ఆ ముగ్గురికీ బౌలింగ్ చేస్తానంటూ కెప్టెన్, ఇద్దరి ఓపెనర్ల బ్యాటింగ్ పై కన్నేశాడు.

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు బౌలింగ్‌ చేయాలని ఉందని తన మనసులోని మాటను వెల్లడించాడు దక్షిణాఫ్రికా మాజీ బౌలర్‌ ఆండ్రూ నెల్‌. ప్రస్తుతం ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ కోసం కోహ్లీ సేన సఫారీ గడ్డపై పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ ఆండ్రూ నెల్‌ మాట్లాడుతూ..'బౌలర్లను సవాలు చేసే బ్యా్ట్స్‌మెన్లకు బంతులేయడం అంటే నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యనటలో ఉన్న భారత క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధావన్‌, హార్దిక్‌ పాండ్య మా బౌలర్లకు సవాల్‌గా మారారు. సఫారీ గడ్డపై భారత్‌ సాధించిన విజయాల్లో వీరి పాత్రే ఎక్కువ' ఉంటుందని పేర్కొన్నాడు.

ఇంకా మాట్లాడుతూ.. 'అందుకే నాకు ఈ ముగ్గురికీ బౌలింగ్‌ చేయాలని ఉంది. మేము బౌలింగ్‌తో సమాధానం ఇవ్వాలని అనుకుంటే వీరు తమ బ్యాట్లతో మాకు తిరిగి సమాధానం ఇస్తారు. ఇరు జట్ల మధ్య పోటీతత్వం ఎక్కువ. ఏ ఒక్క ఆటగాడు చిన్న అవకాశం వచ్చినా వదులుకునే స్థితిలో లేరు' అని నెల్‌ తెలిపాడు.

నెల్‌ కోరిక తీరాలంటే కాస్త కష్టంతో కూడుకున్నదే. ఎందుకంటే అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి సుమారు పదేళ్లు గడిచింది. భారత్, దక్షిణాఫ్రికా ఇరు జట్ల మధ్య మంగళవారం ఫిబ్రవరి 13న ఐదో వన్డే జరగనుంది.

Teams (from):
India: Virat Kohli (Capt), Shikhar Dhawan, Rohit Sharma, Ajinkya Rahane, Shreyas Iyer, Manish Pandey, Dinesh Karthik, Kedar Jadhav, MS Dhoni (wk), Hardik Pandya, Yuzvendra Chahal, Kuldeep Yadav, Axar Patel, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Mohammed Shami, Shardul Thakur.
South Africa: Aiden Markram (capt), Hashim Amla, JP Duminy, Imran Tahir, David Miller, Morne Morkel, Chris Morris, Lungisani Ngidi, Andile Phehlukwayo, Kagiso Rabada, Tabraiz Shamsi, Khayelihle Zondo, Farhaan Behardien, Heinrich Klaasen (wk), AB de Villiers.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 13, 2018, 9:00 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి