న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రీజులో నిలిస్తే చాలు.. పరుగులు అవే వస్తాయి: సెంచరీపై రోహిత్ శర్మ

India Vs West Indies 2018, 4th ODI : I Knew The Runs Would Come Once I Got Set Says Rohit Sharma
Rohit Sharma

హైదరాబాద్: ముంబైలోని బబౌర్న్ స్టేడియంలో సోమవారం వెస్టిండిస్‌తో జరిగిన నాలుగో వన్డేలో కాసేపు క్రీజులో నిలిస్తే చాలని తాను అనుకున్నట్లు భారత ఓపెనర్ రోహిత్ శర్మ వెల్లడించాడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో 152 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరాడు.

ఈ నేపథ్యంలో ముంబైలో సొంత అభిమానుల మధ్య జరిగిన నాలుగో వన్డేలో అభిమానుల అంచనాల్ని అందుకుంటూ తొలి బంతినే రోహిత్ శర్మ బౌండరీకి తరలించాడు. ఓపెనర్ శిఖర్ ధావన్(38), కెప్టెన్ విరాట్ కోహ్లీ(16) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ... రోహిత్ శర్మ(162: 137 బంతుల్లో 20 పోర్లు, 4 సిక్సులు) సెంచరీ సాధించాడు.

 ఓపెనర్‌గా 19వ సెంచరీ

ఓపెనర్‌గా 19వ సెంచరీ

వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 21వ సెంచరీ కావడం విశేషం. ఇక, ఓపెనర్‌గా 19వ సెంచరీ. రోహిత్ శర్మ భారీ సెంచరీతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియానిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. రోహిత్‌తో పాటు అంబటి రాయుడు (100: 81 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీతో రాణించాడు.

 రోహిత్ శర్మ మాట్లాడుతూ

రోహిత్ శర్మ మాట్లాడుతూ

భారత ఇన్నింగ్స్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ "క్రీజులో నిలిస్తే చాలు.. అలవోకగా పరుగులు సాధించొచ్చని నాకు తెలుసు. ఎందుకంటే.. ముంబైలోనే క్రికెట్‌ ఆడుతూ పెరిగాను. ముఖ్యంగా బ్రబౌర్న్ స్టేడియంలో చాలా మ్యాచ్‌లు ఆడాను. ఈ మ్యాచ్‌లో కూడా నేనేమీ బంతిని బలంగా బాదలేదు. బంతి గమనానికి అనుగుణంగా షాట్‌ లు ఆడాను" అని అన్నాడు.

 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మైదానంలో మ్యాచ్

12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మైదానంలో మ్యాచ్

"12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మైదానంలో అంతర్జాతీయ వన్డే జరుతుండటంతో.. భారీ లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచాలని ముందే నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలో ఒక మెరుగైన భాగస్వామ్యం అంబటి రాయుడితో నాకు లభించింది" అని రోహిత్ శర్మ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డును నమోదు చేశాడు.

 అతి తక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన భారత బ్యాట్స్‌మన్‌గా

అతి తక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన భారత బ్యాట్స్‌మన్‌గా

ఓపెనర్‌గా 19వ సెంచరీ పూర్తి చేసుకున్న క్రమంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ రికార్డు సాధించాడు. మొత్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. 107 ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా 19వ సెంచరీ నమోదు చేయగా.... అంతకముందు సచిన్‌ టెండూల్కర్‌ 115 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా 19 సెంచరీలు పూర్తి చేశాడు. సచిన్‌ కంటే 8 ఇన‍్నింగ్స్‌లు ముందే రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు.

తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 21 సెంచరీలు పూర్తి చేసుకున్న ఆటగాడిగా

ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్‌ ఆమ్లా అగ్రస్థానంలో ఉన్నాడు. ఆమ్లా 102 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇక, తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 21 సెంచరీలు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో హషీం ఆమ్లా(116), విరాట్ కోహ్లీ(138), ఏబీ డివిలియర్స్‌(183) తర‍్వాత స్థానంలో రోహిత్‌ నిలిచాడు. రోహిత్‌ శర్మ కేవలం 186 ఇన్నింగ్స్‌ల్లో 21వ సెంచరీని సాధించాడు.

Story first published: Monday, October 29, 2018, 21:10 [IST]
Other articles published on Oct 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X