న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ మంచి ఆటగాడే... కానీ, సచిన్ టెండూల్కర్ క్లాస్ కాదు'

I dont place Virat Kohli in same class as Sachin Tendulkar: Abdul Razzaq

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మోడ్రన్ డే దిగ్గజాల్లో ఒకడైనప్పటికీ... క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ క్లాస్‌కు సంబంధించిన వాడు కాదని పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రమాణాలు క్షీణించాయని రజాక్ చెప్పుకొచ్చాడు.

క్రికెట్ పాకిస్థాన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో "1992 నుండి 2007 మధ్య మేము ఆడిన అదే ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఇప్పుడు చూడలేకపోతున్నాం. టీ20 క్రికెట్ గేమ్‌ను పూర్తిగా మార్చి వేసింది. బౌలింగ్, బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్‌ మెరుగ్గా ఉండటం లేదు. ఇదంతా ఇప్పుడు ప్రాథమికమైంది" అని అబ్దుల్ రజాక్ అన్నాడు.

సింగర్‌గా మారిన ధోనీ.. పాట చూడటానికి ధైర్యం కావాలి (వీడియో)!!సింగర్‌గా మారిన ధోనీ.. పాట చూడటానికి ధైర్యం కావాలి (వీడియో)!!

కోహ్లీ మంచి ఆటగాడు

కోహ్లీ మంచి ఆటగాడు

"పరుగులు చేసేటప్పుడు విరాట్ కోహ్లీ చేస్తూనే ఉన్నాడు. అవును, అతడు మంచి ఆటగాడు. నిలకడగా ప్రదర్శన చేస్తున్నాడు. కానీ, నేను అతడిని సచిన్ టెండూల్కర్ క్లాస్‌తో పోల్చలేను. అతను పూర్తిగా వేరే క్లాస్" అని అబ్దుల్ రజాక్ తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో నెట్స్‌లో రాణించిన యువ బౌలర్లను ఎంపిక చేయడంపై మండిపడ్డాడు.

నెట్స్‌లో రాణించిన బౌలర్లను

నెట్స్‌లో రాణించిన బౌలర్లను

"ఆస్ట్రేలియాకు వెళ్లిన బౌలర్లు నెట్స్‌లో ఉన్న సీనియర్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది గురి చేసినందుకు వారిని తుది జట్టులో ఎంపిక చేశారని తెలుసు. ఎంపికకు ఇది ఏదైనా ప్రమాణమా? నెట్ ప్రదర్శనలలో ఆటగాళ్లను ఎంచుకోవడం ఆమోదయోగ్యం కాదు. రియల్ టైమ్ మ్యాచ్‌లో అతను ఎలా ప్రదర్శన ఇస్తాడో మీకు తెలియదు" అని రజాక్ మండిపడ్డాడు.

నసీమ్ షా టెస్టు అరంగేట్రంపై

నసీమ్ షా టెస్టు అరంగేట్రంపై

ఆస్ట్రేలియా పర్యటనలో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన నసీమ్ షాపై కూడా అబ్దుల్ రజాక్ స్పందించాడు. "నసీమ్ షా, హస్నైన్ మంచి ప్రదర్శన చేశారు. కానీ, వారిని టెస్టుల్లో ఆడించటం చాలా తొందర పాటు నిర్ణయమని నేను నమ్ముతున్నాను. వారు మరింత బోధించి ఆ దిశగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది" అని రజాక్ చెప్పుకొచ్చాడు.

1996 నుంచి 2011 మధ్య కాలంలో

1996 నుంచి 2011 మధ్య కాలంలో

1996 నుంచి 2011 మధ్య కాలంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు అబ్దుల్ రజాక్ ప్రాతినిథ్యం వహించాడు. 2000ల్లో అబ్దుల్ రజాక్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ జట్టు ప్రపంచ క్రికెట్‌కు అందించిన అత్యుత్తమ ఆల్ రౌండర్లలో అబ్దుల్ రజాక్ ఒకడు.

Story first published: Thursday, December 5, 2019, 15:07 [IST]
Other articles published on Dec 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X