న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాయుడు విషయంలో ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణతో ఏకీభవించను

I Don't Agree With MSK Prasad's Explanation On Rayudu : Azharuddin || Oneindia Telugu
I dont agree with MSK Prasads explanation on Ambati Rayudu says Mohammad Azharuddin

తెలుగు తేజం అంబటి రాయుడు నిష్క్రమణపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఇచ్చిన వివరణతో ఏకీభవించను అని టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్‌ అజహరుద్దీన్‌ అన్నారు. ప్రపంచకప్‌ జట్టులో ఎవరైనా గాయపడితే స్టాండ్‌బైగా ఉన్న ఆటగాడినే ఎంపిక చేయాలి. కానీ రాయుడి విషయంలో సెలక్షన్‌ కమిటీ వ్యవహార శైలి బాగాలేదు అని అజహరుద్దీన్‌ అసంతృప్తి వ్యక్తం చేసారు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

శంకర్‌కి అవకాశం :

శంకర్‌కి అవకాశం :

నాలుగో స్థానంలో టీమిండియా ఎందరినో పరీక్షించి చివరకు అంబటి రాయుడుకు ఫిక్స్ అయింది. 2019 జనవరి వరకు రాయుడిని టీమిండియాలో నాలుగో స్థానంలో ఆడించారు. కేవలం ఆస్ట్రేలియా, ఐపీఎల్-12లో సరిగా ఆడనందుకు ప్రపంచకప్‌ జట్టులో చోటు కల్పించలేదు. అతని స్థానంలో విజయ్‌ శంకర్‌కి సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. విజయ్ శంకర్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో (త్రీ డైమన్షన్స్‌) జట్టుకి ఉపయోగపడతాడని ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు.

రెండు సార్లు నిరాశే:

రెండు సార్లు నిరాశే:

రాయుడుని ఎంపిక చేయకపోవడంతో సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో చివరకు రాయుడిని స్టాండ్‌బైగా ప్రకటించారు. ఓపెనర్ శిఖర్ ధావన్‌, విజయ్‌ శంకర్ గాయపడితే రిషబ్ పంత్‌, మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. రాయుడికి రెండు సార్లు నిరాశే ఎదురైంది. తీవ్ర మనస్తాపానికి గురైన రాయుడు ప్రపంచకప్‌ టోర్నీ జరుగుతుండగానే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రాయుడి రిటైర్మెంట్‌కు త్రీడీ ట్వీట్‌ కూడా ఓ కారణమేనని వార్తలు వచ్చాయి.

స్టాండ్‌బైకే అవకాశం:

స్టాండ్‌బైకే అవకాశం:

ఈ వివాదం ప్రపంచకప్‌ జట్టును ప్రకటించినప్పటి నుండి జరుగుతూనే ఉంది. ఎందరో మాజీలు స్పందించారు. టోర్నీ అయిపోయి దాదాపు రెండు వారాలు కావొస్తోంది. ఇప్పుడు అజాహరుద్దీన్‌ స్పందించారు. 'స్టాండ్‌బైగా ఎంపికయిన ఆటగాడు జట్టులో ఎవరైనా గాయపడితే అతడి స్థానంలో వెళ్లాల్సి ఉంటుంది. కచ్చితంగా స్టాండ్‌బైకే అవకాశం ఇవ్వాలి. కోచ్‌, కెప్టెన్ నిర్ణయాన్ని సెలక్టర్లు వ్యతిరేకించవచ్చు, మేము అతన్నే పంపిస్తాం అని చెప్పొచ్చు' అని అజాహరుద్దీన్‌ అన్నారు.

వివరణను అంగీకరించను:

వివరణను అంగీకరించను:

'నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కొంత మంది ఆటగాళ్లు కావాలని సెలెక్టర్లను అడిగాను. కానీ అందుకు వారు ఒప్పుకోలేదు. అప్పుడు సెలక్టర్లు అలా వ్యవహరించారు. ఇపుడు రాయుడుని ఎంపిక చేయకపోవడం ఎంతో బాధాకరం. మొత్తానికి అలా జరిగిపోయింది. ఏదేమైనా ఎమ్మెస్కే వివరణను నేను అంగీకరించను' అని అజహరుద్దీన్‌ పేర్కొన్నారు.

Story first published: Wednesday, July 24, 2019, 12:29 [IST]
Other articles published on Jul 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X