న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్‌లోని ఆ ప్రత్యేకత కోసమే టీమిండియా నిరీక్షణ : పఠాన్

I’d like to see that’ Irfan Pathan suggests new role for Rishabh Pant in Indian team

ఆక్లాండ్‌ : హార్డ్ హిట్టర్‌గా రిషబ్ పంత్‌ రాణించాలనేదే టీమిండియా అభిమతమని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి పూర్తి స్థాయి కామెంటేటర్‌గా అవతారమెత్తిన ఈ బరోడా క్రికెటర్ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు సహచర కామెంటేటర్ దీప్ ధాస్ గుప్త భారత జట్టులోని రిషభ్ పాత్ర ఏంటని పఠాన్ ప్రశ్నించాడు. 'ఇర్ఫాన్.. కేఎల్ రాహుల్ కీపర్‌గా మారిన పరిస్థితుల్లో జట్టులో రిషబ్ పంత్ పాత్ర ఏంటి?'అని ప్రశ్నించాడు. పంత్‌లోని హార్డ్ హిట్టర్ కోసం టీమిండియా అన్వేషిస్తుందని పఠాన్ సమాధానమిచ్చాడు. అతనో మంచి మ్యాచ్‌ ఫినిషరని భావించే చాలా అవకాశాలు ఇచ్చారని, వాటిని పంత్ సద్వినియోగం చేసుకోలేకపోయాడన్నాడు.

IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోని జీతం ఎంతో తెలుసా?IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోని జీతం ఎంతో తెలుసా?

పంత్‌లోని మంచి హార్డ్ హిట్టర్ కోసం టీమ్‌మేనేజ్‌మెంట్ అవకాశాలు ఇచ్చుకుంటూ పోయింది. అతనిపై నమ్మకంతోనే ఇదంతా చేసింది. కానీ పంత్‌ ఆ అంచనాలను అందుకోలేకపోవడం వాస్తవం. ఐపీఎల్‌లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున హార్డ్ హిట్టింగ్ విజయాలందించాడు. భవిష్యత్తులో ఇలా రాణించాలనేదే టీమ్‌మేనేజ్‌మెంట్ ఆకాంక్ష. అందుకే అతనికి మద్దుతగా నిలుస్తుంది. నేను కూడా అతన్ని మంచి హార్డ్ హిట్టర్‌గా చూడాలనుకుంటున్నా. ఒకవేళ పంత్ ఆరో స్థానంలో వచ్చి హార్ధిక్ పాండ్యా ఏడో స్థానంలో బ్యాటింగ్ వస్తే టీమిండియా లోయర్ ఆర్డర్ మరింత బలంగా తయారవ్వనుంది. టీ20లకు కావాల్సింది కూడా ఇదే'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.

పలుమార్లు విఫలమైనా వరుసగా అవకాశాలు దక్కించుకున్న రిషబ్ పంత్‌కు గత ఆస్ట్రేలియా సిరీస్‌లో టీమ్‌మేనేజ్‌మెంట్ గట్టి ఝలక్ ఇచ్చింది. తొలి వన్డేలో గాయపడటంతో అతని స్థానంలో కీపింగ్ చేసిన కేఎల్ రాహుల్ సమర్థవంతంగా రాణించాడు. దీంతో పంత్‌ను పక్కన పెట్టిన టీమ్‌మేనేజ్‌మెంట్ రాహుల్‌నే కీపర్‌గా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పంత్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో కూడా తుది జట్టులో పంత్‌కు అవకాశం దక్కలేదు. సీనియర్ క్రికెటర్లు మాత్రం పంత్‌నే కొనసాగించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీకి సూచిస్తున్నారు.

Story first published: Friday, January 24, 2020, 14:08 [IST]
Other articles published on Jan 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X