న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆతృతగా ఉన్నా: 21 నెలలు తర్వాత సొంత ప్రేక్షకుల మందుకు స్టీవ్ స్మిత్

I can’t wait to play – Steve Smith excited about upcoming home season

హైదరాబాద్: సొంత ప్రేక్షకుల మధ్య బరిలోకి దిగిడానికి ఎంతో ఆతృతగా ఉన్నానని ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం జట్టుని ప్రకటించింది. స్మిత్, వార్నర్‌లు తిరిగి టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా శ్రీలంకతో ఆదివారం ఆస్ట్రేలియా తొలి టీ20 ఆడనుంది. చివరగా సొంత ప్రేక్షకుల మధ్య 2018 జనవరిలో ఆడాడు. 2017-18 యాషెస్ సిరిస్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరిస్‌లో స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా తరుపున ఆడాడు.

లీగల్ యాక్షన్ దిశగా!: షకీబ్‌కు ఊహించిన షాకివ్వనున్న బంగ్లా క్రికెట్ బోర్డులీగల్ యాక్షన్ దిశగా!: షకీబ్‌కు ఊహించిన షాకివ్వనున్న బంగ్లా క్రికెట్ బోర్డు

ఆ తర్వాత మార్చి 2018లో కేప్ టౌన్ వేదికగా బాల్ టాంపరింగ్ ఉదంతం చోటు చేసుకోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతడిపై ఏడాదిపాటు నిషేధం విధించింది. నిషేధం ముగిసిన తర్వాత స్టీవ్‌ స్మిత్‌ ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు టెస్టుల్లో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. నిషేధం తర్వాత క్రికెట్‌ను తిరిగి ప్రారంభించిన స్మిత్ సొంతగడ్డపై ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడలేదు. స్మిత్ ఆడిన వరల్డ్‌కప్, యాషెస్‌ సిరిస్‌లు రెండూ ఇంగ్లాండ్‌లోనే జరిగాయి.

దాదాపు 21 నెలల తర్వాత సొంత అభిమానుల మధ్య బరిలోకి దిగుతుండటంతో స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించడం ఎంతో గౌరవంగా ఉంటుంది. ఆసీస్‌ తరఫున అస్ట్రేలియాలోనే బరిలోకి దిగడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఆ క్షణం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను" అని అన్నాడు.

అసలేం జరుగుతోంది! సమ్మె విరమించినా... ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టిన షకీబ్అసలేం జరుగుతోంది! సమ్మె విరమించినా... ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టిన షకీబ్

"వచ్చే ఏడాది ఆసీస్ వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. గత కొన్నేళ్లుగా టీ20 వరల్డ్‌కప్‌లో మా ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటి నుంచి వరుసగా మేము ఆరు టీ20లు ఆడబోతున్నాం. శ్రీలంకతో మూడు, ఆ తర్వాత పాక్‌తో మూడు. వరల్డ్‌కప్‌కు సన్నద్ధమవ్వడానికి ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది" అని స్మిత్‌ అన్నాడు.

Story first published: Saturday, October 26, 2019, 16:59 [IST]
Other articles published on Oct 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X