న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎందుకని అడగొద్దు: 'టీమిండియా కాదు, ఆస్ట్రేలియానే ఫేవరేట్‌గా ఎంచుకుంటా'

I am picking Australia over India but dont ask me why: Ian Chappell

హైదరాబాద్: ఎందుకో చెప్పలేను గానీ... డిసెంబర్ 6 నుంచి భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో టీమిండియాకు బదులు ఆస్ట్రేలియానే ఫేవరెట్‌గా ఎంచుకుంటానని ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం ఇయాన్ ఛాపెల్‌ అన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డిసెంబర్ 6 నుంచి ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.

 ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ

ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ పేపర్‌పై కోహ్లీసేన బలంగా కనిపిస్తున్నా ఆ జట్టులో ఏదో మిస్సవుతోందని అన్నాడు. "నేను ఆసీస్‌నే ఎంచుకుంటా. ఎందుకని అడక్కండి. ఇంగ్లాండ్‌లో టీమిండియా ఆటతీరు నిరాశపరిచింది. వారు ఆ సిరీస్‌ గెలవాల్సింది. వారికున్న నైపుణ్యం ప్రకారం ఆస్ట్రేలియాను ఓడించగలరు. కానీ ఆ జట్టులో ఏదో మిస్సవుతోంది" అని అన్నాడు.

 సొంతగడ్డపై ఆసీస్‌ దూకుడుగా ఆడగలదు

సొంతగడ్డపై ఆసీస్‌ దూకుడుగా ఆడగలదు

"అయితే, ఇందుకు మరో కారణం కూడా ఉంది. సొంతగడ్డపై ఆసీస్‌ దూకుడుగా ఆడగలదు. స్థానిక పరిస్థితుల్లో భారత బౌలింగ్‌ దాడి నిరూపించుకోలేదు. ఇది బలమైన కారణం కాదు. అయినప్పటికీ ఆసీస్‌నే ఎంచుకుంటా. నేను ఆస్ట్రేలియా పేసర్లు విరాట్‌ కోహ్లీ మధ్య పోటీనే ప్రధానంగా చూడాలనుకుంటున్నా. ఇదో గొప్ప పోటీ" అని ఛాపెల్ అన్నాడు.

 గత పర్యటనలో విరాట్‌ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు

గత పర్యటనలో విరాట్‌ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు

"గత పర్యటనలో విరాట్‌ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్‌లో టీమిండియా బౌలర్లు బంతిని బాగానే స్వింగ్‌ చేశారు. ఇక్కడ అలా చేస్తారని అనిపించడం లేదు. వారి బౌలింగ్‌ ఎలా ఉండబోతోందో చూడాలని ఆసక్తిగా ఉంది. ఇదే సిరీస్‌లో అత్యంత కీలకం. గత భారత జట్ల కన్నా ప్రస్తుత జట్టు ఆసీస్‌ పరిస్థితుల్లో బాగా బౌలింగ్‌ చేయగలదు" అని ఛాపెల్ తెలిపాడు.

 పాండ్యా ఉంటే టీమిండియా సమతూకంగా ఉండేది

పాండ్యా ఉంటే టీమిండియా సమతూకంగా ఉండేది

"టీమిండియాలో ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా ఉంటే టీమిండియా సమతూకంగా ఉండేది. ఆసీస్‌ ఈ సిరీస్‌లో ప్రతిసారీ 350-400 పరుగులు చేయాలని కోరుకుంటున్నా. అలా చేస్తే ఆశ్చర్యమే" అని ఛాపెల్‌ పేర్కొన్నాడు. బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ ఈ సిరిస్‌కు దూరం కావడంతో ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది.

Story first published: Saturday, December 1, 2018, 15:20 [IST]
Other articles published on Dec 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X