న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైకోర్టు గ్రీన్‌సిగ్నల్: ఫలితాలు ప్రకటించొద్దని ఆదేశాలు

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 17న ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. 

By Nageshwara Rao

హైదరాబాద్: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 17న ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.

పారదర్శకత: హెచ్‌సీఏ ఎన్నికల బరిలో అజహరుద్దీన్‌పారదర్శకత: హెచ్‌సీఏ ఎన్నికల బరిలో అజహరుద్దీన్‌

హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని డిసెంబర్‌ 23న రంగారెడ్డి జిల్లా ఐదవ అదనపు న్యాయస్థానం జడ్జి ఆదేశాలు జారీచేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హెచ్‌సీఏ ఎన్నికల ప్రక్రియ జరుగడం లేదని, ఎన్నికలను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ అసోసియేషన్ కార్యదర్శి జాన్ మనోజ్ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషనర్‌ వాదనను తొసిపుచ్చిన న్యాయమూర్తి

పిటిషనర్‌ వాదనను తొసిపుచ్చిన న్యాయమూర్తి

ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన జస్టిస్ చల్లా కోదండరామ్ నేతృత్వంలోని ధర్మాసనం 17న జరిగే ఎన్నికలను వాయిదా వేయాలన్న పిటిషనర్‌ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఎన్నికలను యథాతథంగా జరుపుకోవచ్చని అన్నారు. అయితే, ఎన్నికల ఫలితాలను మాత్రం తాము ఉత్తర్వులు జారీచేసే దాకా ప్రకటించవద్దని ఆదేశించారు.

తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా

తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా

తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. హెచ్‌సీఏ అధ్యక్ష పదవికోసం మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, మాజీ ఎంపీ వివేక్‌లు నామినేషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం టెస్టు మ్యాచ్‌లాడిన క్రికెటర్లు ఆయా రాష్ట్ర సంఘాల ఎన్నికల్లో ఓటింగ్‌కు అర్హులు. అయితే హెచ్‌సీఏ ఎన్నికల్లో ఓటర్ల నమోదు గడువు ఆదివారంతో ముగిసింది.

ఓటు హక్కు లేని అజహరుద్దీన్

ఓటు హక్కు లేని అజహరుద్దీన్

ఇందులో ఓటరుగా అజహరుద్దీన్ తన పేరు నమోదు చేసుకోలేదు. హెచ్‌సీఏలో ఓటు హక్కు లేనందున అజరుద్దీన్ ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హుడు కాదని ప్రత్యర్ధి వర్గం వాదిస్తోంది. దీంతో అజహర్‌ నామినేషన్‌ వేసినా అది చెల్లుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరిరోజు

నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరిరోజు

మరోవైపు నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరిరోజు కావడంతో, ఎవరెవరు ఎన్నికల బరిలో ఉంటారన్నది ఈరోజు తేలనుంది. సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాల నేపథ్యంలో అడ్‌హక్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రకాశ్‌చంద్‌ జైన్‌ ఆధ్వర్యంలో జనవరి 17న హెచ్‌సీఏకు ఎన్నికలు జరుగుతున్నాయి. న్యాయవాది రాజీవ్‌రెడ్డి రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X