న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దుబాయ్ ఎండలకు టీమిండియా ఆపసోపాలు(వీడియో)

How Team India is Battling Extreme Heat in Dubai

న్యూ ఢిల్లీ: ఆసియాకప్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. అభిమానులను వేడెక్కిస్తున్నాయి. ఎడారి ప్రాంతం దుబాయ్‌లో వేడికి ఆటగాళ్లు ఉడికిపోతున్నారు. దాదాపు 40 డిగ్రీలు దాటి ఎండ కాస్తుండటంతో ఇబ్బంది పడుతున్నారు. పరుగులు తీయాలన్నా శరీరంలోని నీరంతా ఆవిరైపోతోంది. చూస్తుంటే టీమిండియా ఇందుకు ఓ ఉపాయం కనిపెట్టినట్టుంది.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు సాధన చేశారు. ఎండకు కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే చల్లని మంచినీటి సీసాలను మెడపై పెట్టుకున్నారు. కొందరేమో ఐస్ ‌డబ్బాలో తలపెట్టేశారు. ఇంకొకరేమో టోపీలో మంచు గడ్డలు వేసుకొని తలకు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 'దుబాయ్‌లో ఎండలకు టీమిండియా కనిపెట్టిన విధానాలు' అంటూ బీసీసీఐ ఓ ట్వీట్‌ చేసింది.

బీసీసీఐ‌తో పాటుగా టీమిండియా విజయం పట్ల వీరేందర్ సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలియజేశాడు. అతనితో పాటుగా వీవీఎస్ లక్ష్మణ్ కూడా తన అభినందనలను దుబాయ్ ఎండలతో పోల్చి చెప్పారు. 'ఇంతటి ఎండలోనూ ఇండియా బ్యాక్ టు బ్యాక్' మ్యాచ్‌లు ఆడి విజయాలను అందుకుంది. బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. రోహిత్ నాయకత్వంలో టీమిండియా బ్రిలియంట్‌గా ఆడింది. కంగ్రాచ్యులేషన్స్!' అని పేర్కొన్నాడు.

ఆసియా కప్‌లో తన ఆరంభ మ్యాచ్‌లో హాంకాంగ్‌ను చిత్తుగా ఓడించింది పాకిస్థాన్‌. ఆ చిన్న జట్టుపై టీమ్‌ఇండియా మాత్రం చచ్చీ చెడీ గెలిచింది. ఇక దుబాయేమో పాకిస్థాన్‌కు రెండో సొంతగడ్డ. అయినా టీమిండియా బౌలర్లు విజృంభించి.. బ్యాట్స్‌మెన్ చెలరేగారు. భారత్‌కు సునాయాస విజయాన్నందించారు. సూపర్‌-4 దశలో భారత్‌.. ఆదివారం పాక్‌తో మళ్లీ తలపడబోతుండటం విశేషం.

Story first published: Thursday, September 20, 2018, 11:34 [IST]
Other articles published on Sep 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X