న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అత్త చెప్పింది.. జరిగిపోయింది, కసితో ద్రవిడ్ సెంచరీని..: గంగూలీ

How Sourav Ganguly’s mom-in-law predicted India would win iconic Kolkata Test vs Australia

హైదరాబాద్: భారత క్రికెట్‌ చరిత్రలో ఆ మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. 2001 మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన కోల్‌కతా టెస్టు గంగూలీ సారథ్యాన్ని బలపడేలా చేసింది. ఆ మ్యాచ్‌ విజయంతో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరినైనా ఓడించగలమన్న ఆత్మ విశ్వాసం టీమిండియాకు వచ్చింది.

అయితే అప్పటికే ఓటమి అంచున ఉన్న భారత జట్టు గెలుస్తుందని ముందే చెప్పిందట సౌరభ్‌‌ గంగూలీ అత్తయ్య. ఇటీవల విడుదలైన ఆత్మకథలో గంగూలీ ఈ వివరాలు వెల్లడించారు. ముందే నవ్వొచ్చినా తర్వాత ఆశ్చర్యమేసిందంటూ ఆవిడను కొనియాడారు.

మ్యాచ్ పరిస్థితి గందరగోళంగా ఉంటే:

మ్యాచ్ పరిస్థితి గందరగోళంగా ఉంటే:

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. మేం 171కే ఆలౌట్‌ అయ్యాం. అప్పటికే ఓటమి తప్పదనీ సిరీస్‌ పోయిందనీ నిశ్చయించుకున్నా. నా సారథ్యమూ పోయిందనే అనుకున్నా. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ ఫాలోఆన్‌ చెప్పింది. తర్వాత మేమంతా మా హోటల్‌ గదిలో కూర్చున్నాం. క్రికెటర్లంతా క్రికెట్‌ గురించి తప్ప ఇంకేవో మాట్లాడుకుంటున్నాం.

 నేను అత్తలెప్పుడూ ఇంతే:

నేను అత్తలెప్పుడూ ఇంతే:

మా అత్తయ్య ఇంటి నుంచి కొన్ని ఆహార పదార్థాలు తీసుకొచ్చారు. అంతలోనే మా అత్తయ్య ‘సౌరభ్‌‌ నువ్వు మ్యాచ్‌ గెలుస్తున్నావ్‌' అన్నారు. అప్పుడు నేను అత్తలెప్పుడూ ఇంతే! ఏ సమయంలో ఏది మాట్లాడకూడదో అదే మాట్లాడతారని అనుకున్నా'' అని నవ్వుతూ చెప్పారు దాదా.

శాంతపరిచిన సతీమణి:

శాంతపరిచిన సతీమణి:

‘‘మా అత్తయ్య వెళ్లగానే నేను ఇంటికి ఫోన్‌ చేసి నా భార్యతో మాట్లాడాను. ‘మీ అమ్మెప్పుడూ ఎందుకు ఇలాగే చేస్తుంది' అని ప్రశ్నించా. నా సతీమణి నన్ను శాంతపరిచి ఆ సంగతంతా మర్చిపొమ్మని చెప్పింది. రెండు రోజుల తర్వాత చూస్తే చరిత్రలోనే ఓ అద్భుతం ఆవిష్కృతం అయింది. నేనెప్పుడూ తన మాటలు మర్చిపోకుండా చేసింది మా అత్తయ్య'' అని గంగూలీ అన్నారు.

 కోల్‌కత్తాలో మా ఇంట్లో:

కోల్‌కత్తాలో మా ఇంట్లో:

ఇంటికొచ్చాక నవ్వులే‘‘మ్యాచ్‌ గెలిచిన తర్వాత జట్టు సభ్యులందరినీ మా ఇంటికి భోజనానికి ఆహ్వానించా. మా అత్తగారిల్లు మా ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. మేమంతా మా ఇంట్లోకి ప్రవేశిస్తుండగా మా అత్తయ్య పక్కింటి బాల్కనీలో నిల్చొని పెద్దగా నవ్వుతూ అందరు ఆటగాళ్లకు ‘నేను రెండు రోజులు ముందే సౌరభ్‌‌కు చెప్పాను ఇలా జరుగుతుందని' అని చెప్పింది.

 ద్రవిడ్, లక్ష్మణ్:

ద్రవిడ్, లక్ష్మణ్:

కానీ, నిజంగా నాకు తెలియదు ఆటలో మూడో రోజు ఆమె ఏం ఆలోచించిందో. వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ తప్ప నాతో సహా మిగిలిన ఆటగాళ్లెవ్వరం ఆమె మాటల గురించి ఆలోచించలేదేమో!'' అని దాదా ఆనాటి క్షణాలను అందరితో పంచుకున్నారు.

 ద్రవిడ్ ఫీలింగ్ బ్యాడ్:

ద్రవిడ్ ఫీలింగ్ బ్యాడ్:

వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోసం బ్యాటింగ్‌ స్థానం మార్చినందుకు రాహుల్‌ ద్రవిడ్‌ కలత చెందాడు. తొలి ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్ ఒక్కడే అర్ధశతకం సాధించడంతో అలా చేశాం. అయితే ఫాలోఆన్‌లో లక్ష్మణ్‌ 281తో పాటు ద్రవిడ్‌ 180 పరుగులు చేశాడు. దాంతో అంతా సెట్టయింది. రాహుల్‌ సైతం తొలి ఇన్నింగ్స్‌లో అంత బాగా ఆడలేదన్న బాధతో ఉన్నాడు.

 సెంచరీ చేసి కసిని చూపించాడు:

సెంచరీ చేసి కసిని చూపించాడు:

ఫాలోఆన్‌లో సెంచరీ చేయగానే అతడిలోని కసినంతా ప్రదర్శించాడు. దాని అర్థం ఏంటో అందరికీ తెలుసు. అతడు తన బ్యాట్‌తో ప్రెస్‌బాక్స్‌ వైపు వందనం చేయడం అందరం చూశాం. అది నాకెంతో నచ్చింది. ఆ ఇన్నింగ్స్‌ తర్వాత ద్రవిడ్‌ ఇంకా మెరుగైన ఆటగాడిగా మారాడు. చెన్నైలోనూ అతడు 80 పరుగులు చేశాడు. మేం సిరీస్‌ గెలిచాం. ఈ సిరీస్‌ నన్నూ మార్చింది. ఒక ఆటగాడిగా ఒక సారథిగా. ఇది భారత క్రికెట్‌లో మార్పునకు కేంద్ర బిందువు అని చెప్తాను'' అని దాదా అన్నారు.

Story first published: Saturday, March 3, 2018, 11:34 [IST]
Other articles published on Mar 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X