కేవలం..ఒక్క ఫోను షమీకి ఎన్ని కోట్లు నష్టాన్ని తెచ్చిందో తెలుసా..?

Posted By:
 How much money Mohammed Shami could lose due to controversy - Find Out

హైదరాబాద్: ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో.. లేదో తెలియదు. కానీ, ఒక్క ఫోను మాత్రం షమీకి కోట్ల రూపాయల్లో నష్టాన్ని తీసుకొచ్చింది. షమీకి అమ్మాయిలతో శారీరక సంబంధాలు ఉన్నాయని అతడి భార్య హసీన్ జహాన్ ఆరోపించింది. పాకిస్థాన్‌కు చెందిన యువతితో అతడు తిరుగుతున్నాడంటూ మీడియా ముందు బాధను వెల్లగక్కింది. లీగల్‌గా అతనిపై పలు కేసులు పెట్టించింది.

భార్య మోపిన కేసుల పుణ్యామని షమీకి కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లనుంది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు ప్రకటించే సమయంలోనే హసీన్ షమీపై ఆరోపణలు గుప్పించింది. దీంతో చివరి నిమిషంలో బోర్డు అతడి పేరును తొలగించింది. గత ఏడాది షమీ రూ. 3 కోట్ల కేటగిరీలో ఉన్నాడు. ఈ వివాదం లేకపోతే.. ఇప్పుడు కూడా కచ్చితంగా అంతకంటే పై స్థాయి కాకపోయినా.. అదే కేటగిరిలో అయినా కొనసాగేవాడు.

ఇక ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా షమీ దూరం కానున్నాడు. అదే జరిగితే అతడికి మరో రూ.3 కోట్లు నష్టం వాటిల్లనుంది. ఐపీఎల్-2018 కోసం ఢిల్లీ డేర్‌డెవిల్స్ అతణ్ని ఆర్టీఎం ద్వారా రూ.3 కోట్లు ఖర్చుపెట్టి తమతోనే ఉంచుకుంది. దోషిగా తేలితే.. ప్రకటనలు, ఇతరత్రా మరో రూ. 2 కోట్ల మేర ఆదాయాన్ని షమీ కోల్పోయే ప్రమాదం ఉంది. ఓవరాల్‌గా హసీన్ నమోదు చేసిన కేసుల వల్ల షమీ ఒక్క ఏడాదిలోనే రూ. 6-8 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

తనను చంపేందుకు ప్రయత్నించారని ఆమె కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గృహ హింస, హత్యాయత్నం కింద షమీతోపాటు అతడి కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వల్ల షమీ కెరీర్ ప్రమాదంలో పడింది. పేస్ బౌలర్‌గా సత్తా చాటుతున్న షమీ.. పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నాడు.

Story first published: Sunday, March 11, 2018, 16:02 [IST]
Other articles published on Mar 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి