న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చ‌రిత్ర‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లుగా రికార్డు.. మ‌రి ఎన్ని వికెట్లు వారి జ‌ట్ల‌ను గెలిపించాయి?

How many wickets did the bowlers take in Test cricket to win the teams?

టెస్టు క్రికెట్‌లో బౌల‌ర్ల రికార్డుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌మ బౌలింగ్‌తో మ్యాచ్ ఫ‌లితాల‌నే మార్చేస్తుంటారు. పిచ్ కాస్త బౌలింగ్‌కు అనుకూలిస్తే ఆ రోజు బ్యాట‌ర్ల‌కు చుక్క‌లే అని చెప్పుకోవాలి. ఇక మ్యాచ్‌లు ఓడిన‌ప్ప‌టికీ బౌల‌ర్లు మాత్రం అద్భుతంగా ఆడిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. ఇలా టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఎంతో మంది బౌల‌ర్లు తిరుగులేని రికార్డుల‌ను నెల‌కొల్పారు.

అనేక మంది అత్య‌ధిక వికెట్ల వీరులుగా నిలిచారు. అయితే బౌల‌ర్లు ఎన్ని వికెట్లు తీసిన‌ప్ప‌టికీ ఆ మ్యాచ్‌లో జ‌ట్టు గెల‌వ‌క‌పోతే వారి శ్ర‌మంతా వృథానే అవుతుంది. ఇలా ఆయా బౌల‌ర్లు తీసిన ఎన్ని వికెట్లు వారి జ‌ట్ల విజ‌యాల‌కు దోహ‌ద‌ప‌డ్డాయనేది ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

టాప్‌లో వార్న్‌, ముర‌ళీధ‌ర‌న్

ఈ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గ‌జ స్పిన్న‌ర్ షేన్ వార్న్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. త‌న 145 టెస్ట్ కెరీర్లో షేన్ వార్న్ 708 వికెట్లు తీయ‌గా.. 510 వికెట్లు ఆస్ట్రేలియాకు విజ‌యాన్ని అందించాయి. పూర్తిగా చెప్పాలంటే ఆస్ట్రేలియా గెలిచిన మ్యాచ్‌ల్లో షేన్ వార్న్ తీసిన వికెట్లు ఇవి.

మిగ‌తా 198 వికెట్లు తీసిన‌ప్పుడు ఆస్ట్రేలియా ఓడిపోయంది. ఇక ఈ జాబితాలో శ్రీ‌లంక స్పిన్ దిగ్గ‌జం ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ రెండో స్థానంలో ఉన్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 133 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ముర‌ళీధ‌ర‌న్ 800 వికెట్లు తీశాడు. ఇందులోని 448 వికెట్లు శ్రీ‌లంక‌కు విజ‌యాన్ని అందించాయి.

మూడు, నాలుగో స్థానంలో వారే

మూడు, నాలుగో స్థానంలో వారే

ఇక మ‌రో ఆస్ట్రేలియా బౌల‌ర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ పేస్ బౌల‌ర్ తీసిన‌ 414 వికెట్లు ఆస్ట్రేలియాకు విజ‌యాన్ని అందించాయి. కాగా కెరీర్లో 124 టెస్టు మ్యాచ్‌లు ఆడిన గ్లెన్ మెక్‌గ్రాత్ 563 వికెట్లు తీశాడు. ఇక నాలుగో స్థానంలో ఇంగ్లండ్ వెట‌ర‌న్ పేస‌ర్ జేమ్స్ అండ‌ర్స‌న్ ఉన్నాడు. కెరీర్లో 169 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అండ‌ర్స‌న్ 640 వికెట్లు తీశాడు. అయితే ఇందులో ఇంగ్లండ్ విజ‌యానికి 338 వికెట్లు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డ్డాయి.

Shane Warne మృతి పై Thai Police Investigation..వెలుగులోకి ఆసక్తికర విషయాలు! | Oneindia Telugu
అశ్విన్‌కు ఎన్నంటే

అశ్విన్‌కు ఎన్నంటే

ఇక ద‌క్షిణాఫ్రికా పేస్ లెజెండ్ డేల్ స్టెయిన్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. కెరీర్లో 93 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 439 వికెట్లు తీశాడు. ఇందులో 305 వికెట్లు సౌతాఫ్రికాకు విజ‌యాన్ని అందించాయి. కాగా ఆరో స్థానంలో టీమిండియా వెట‌ర‌న్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఉన్నాడు. కెరీర్లో ఇప్ప‌టివ‌ర‌కు 85 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 436 వికెట్లు తీశాడు. ఇందులో 304 వికెట్లు భార‌త్ విజ‌యానికి దోహ‌ద‌పడ్డాయి. కాగా ఈ టాప్ 6 జాబితాలోని ఆట‌గాళ్ల‌లో ప్ర‌స్తుతం టీమిండియా స్పిన్న‌ర్ ర‌వి చంద్ర‌న్ అశ్విన్, ఇంగ్లండ్ పేస‌ర్ జేమ్స్ అండ‌ర్స‌న్ మాత్రమే అంత‌ర్జాతీయ‌ క్రికెట్‌లో కొన‌సాగుతున్నారు.

Story first published: Tuesday, March 8, 2022, 15:15 [IST]
Other articles published on Mar 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X