రిషబ్‌ను పార్థివ్‌లా చేయకండి, అందరూ సచిన్‌లు కాదు

Posted By:
RISHABH_aGAIN

హైదరాబాద్: భారత లెజెండరీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెరీర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలంటూ సెలక్టర్లకు సూచనలిస్తున్నాడు. చాలా చిన్న వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అతడిని సచిన్ స్థాయిలో ఊహించుకుని అతనిపై అధిక భారాన్ని మోపొద్దంటూ సలహాలిచ్చాడు. ఆయన శనివారం మీడియాతో ముచ్చటించాడు.

ఇందులో భాగంగానే, యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌లో చక్కటి ప్రతిభ ఉందని, భారత క్రికెట్‌ జట్టు భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా అతడి కెరీర్‌ను జాగ్రత్తగా తీర్చిదిద్దాలని ఆయన పేర్కొన్నాడు. 'సచిన్‌ లాగా 16 ఏళ్లకే అందరూ విజయవంతం కాలేరు. అతనో క్రికెట్‌ మేధావి. అందరి విషయంలోనూ అలా జరగదు. పార్థివ్‌ను మరీ చిన్న వయసులోనే భారత జట్టుకు ఎంపిక చేశారు.
అతడిను అండర్‌-19 స్థాయి నుంచి నేరుగా భారత జట్టుకు ఆడాడు' గుర్తు చేశాడు.

ఇంకా మాట్లాడుతూ.. 'అలా ఎప్పుడూ చేయకూడదు. పార్థివ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు సన్నద్ధంగా లేడు. అనుభవలేమి అతడికి ఇబ్బందిగా మారింది. అందుకే ప్రతి ఆటగాడినీ దేశవాళీల్లో ఎక్కువగా ఆడించి అంతర్జాతీయ క్రికెట్‌కు తగ్గట్లుగా తయారు చేయాలని అంటా. రిషబ్‌లో ప్రతిభ ఉంది. కానీ అతడిని సరిగ్గా తీర్చిదిద్దాలి. అప్పుడే అతను పార్థివ్‌లా కాకుండా ఉండగలడు' అని అభిప్రాయపడ్డాడు.

'పంత్‌ను అయినా, సంజు శాంసన్‌ను అయినా నేరుగా భారత జట్టుకు ఆడించేయకూడదు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో నిలకడగా రాణించాలి. ఫిట్‌నెస్‌, వికెట్‌ కీపింగ్‌ టెక్నిక్‌ ఉన్నత స్థాయికి చేరాలి' అని కిర్మాణి అన్నాడు. ధోని చాలా ముందే టెస్టుల నుంచి తప్పుకున్నాడని, అతనలా చేయాల్సింది కాదని తనకు ఇప్పటికీ అనిపిస్తోందని కిర్మాణి చెప్పాడు.

Story first published: Sunday, March 11, 2018, 9:27 [IST]
Other articles published on Mar 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి