మూడో వన్డేలో ఓటమి: ఆప్ఘన్‌ను వైట్‌వాష్ చేసిన వెస్టిండిస్

హైదరాబాద్: లక్నో వేదికగా సోమవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌ ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.

ఆప్ఘన్ బ్యాట్స్‌మెన్లలో అస్గర్‌ అఫ్గాన్‌ (85 బంతుల్లో 86; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్‌ (59 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్‌ నబీ (66 బంతుల్లో 50 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీలతో మెరిశారు. విండిస్ బౌలర్లలో కీమో పాల్ (3/44), అల్జారీ జోసెఫ్ (2/59) సత్తా చాటారు.

India vs Bangladesh: 3వ టీ20లో చెత్త రికార్డు నమోదు చేసిన రోహిత్ శర్మ

అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండిస్ మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. విండిస్ బ్యాట్స్‌మెన్లలో షాయ్ హోప్ (145 బంతుల్లో 109 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, రోస్టన్‌ ఛేజ్‌ (42 నాటౌట్‌), కింగ్‌ (39), పొలార్డ్‌ (32)లు ఫరవాలేదనిపించారు.

సచిన్ మళ్లీ పుట్టాడు!: క్లబ్ క్రికెటర్లను మించి డైపర్ బుడతడి వీడియో వైరల్
ముజీబుర్‌ రహ్మాన్‌ రెండు వికెట్లు తీశాడు. సెంచరీతో రాణించిన షాయ్ హోప్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.... ఈ సిరిస్‌లో మంచి ప్రదర్శన చేసిన రోస్టన్‌ ఛేజ్‌‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఇదే మైదానంలో గురువారం నుంచి మూడు టి20ల సిరీస్‌ ప్రారంభంకానుంది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, November 12, 2019, 7:37 [IST]
Other articles published on Nov 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X