Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ మళ్లీ పుట్టాడు!: క్లబ్ క్రికెటర్లను మించి డైపర్ బుడతడి వీడియో వైరల్

A Child In Diapers Plays Proffesional Cricket Shots || Oneindia Telugu
 He Has English Cat Or Dog: Michael Vaughan Impressed With Toddlers Perfect Cricket Shots

హైదరాబాద్: క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ వీడియోలో నాలుగేళ్లు కూడా నిండని ఓ బుడతడు ముచ్చటైన షాట్లు ఆడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

వివరాల్లోకి వెళితే
ఫాక్స్‌ క్రికెట్‌ సంస్థ తమ ట్విటర్‌ ఖాతాలో ఒక వీడియో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో రెడ్ కలర్ టీషర్టు, డైపర్‌ ధరించిన ఓ బుడతడు బ్యాట్ పట్టుకుని ఇంట్లో క్రికెట్‌ ఆడుతున్నాడు. ఆ వీడియోని పోస్టు చేసిన ఫాక్స్ క్రికెట్ సంస్థ "ఇప్పటికీ డైపర్లు వేసుకుంటున్నాడు... బ్యాటింగ్ టెక్నిక్ మాత్రం క్లబ్ క్రికెటర్లను మించి ఉంది" అంటూ కామెంట్ పెట్టింది.

దీంతో ఈ వీడియోని చూసిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ తన ట్విట్టర్‌లో రీట్వీట్ చేస్తూ 'Surely he has an English cat or dog' అని కామెంట్ కూడా పెట్టాడు. వీడియోలో డైపర్ వేసుకుని గ్లౌవ్స్‌ ధరించిన బడుతడు ప్రొఫెషనల్ క్రికెటర్ల మాదిరిగా అద్భుతమైన కవర్ డ్రైవ్స్, ఫ్రంట్ ఫుట్, లాఫ్టెడ్ షాట్లు ఆడుతుండడం చూడవచ్చు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాడవంతో నెటిజన్లు బుడతడి ప్రతిభను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'ఇదే అసలైన క్రికెట్‌ స్టైల్‌' అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా... మరొక నెటిజన్ 'సచిన్‌ మళ్లీ క్రికెట్‌లోకి రంగ ప్రవేశం చేశాడు' అని కామెంట్ పెట్టాడు.

Story first published: Monday, November 11, 2019, 19:01 [IST]
Other articles published on Nov 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+