న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పైలట్ అవ్వాలని 21ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి..!!

Top Hong Kong Cricketer Retires At The Age Of 21
https://telugu.mykhel.com/cricket/hong-kong-cricketer-christopher-carter-retires-at-the-age-21-to-become-016611.html

న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్లో దేశం తరఫున ఆడే అవకాశం వస్తే ఏ క్రికెటర్ వదులుకుంటాడు. జట్టులో చోటు దక్కినన్ని రోజులు మ్యాచ్‌లు ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా హాంకాంగ్ క్రికెటర్ క్రిస్టోఫర్ కార్టర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన చిన్ననాటి కలను సాకారం చేసుకోవడానికి 21ఏళ్ల క్రిస్టోఫర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.

ఇటీవల దుబాయ్‌లో ముగిసిన ఆసియాకప్ టోర్నీలోనూ కార్టర్ ఆడాడు. హాంకాంగ్‌లో పుట్టిన కార్టర్‌.. ఆస్ట్రేలియాలో పెరిగాడు. యుక్త వయసు లో క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టిన అతను.. హాంకాంగ్‌కు తిరిగొచ్చి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అతను 21 ఏళ్ల వయసుకే క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు. పైలట్‌ కావాలన్న తన చిన్ననాటి కలను నెరవేర్చుకోవడానికే అతనీ నిర్ణయం తీసుకున్నాడు.

బంగ్లాకు అన్యాయం జరిగిందని కోహ్లీ సైట్ హ్యక్!!బంగ్లాకు అన్యాయం జరిగిందని కోహ్లీ సైట్ హ్యక్!!

వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్రిస్టోఫర్.. పైలట్‌ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ శిక్షణ కోసం తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోతున్నాడు. శిక్షణ పూర్తయ్యాక అతను హాంకాంగ్‌ ఎయిర్‌లైన్స్‌కు పని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఇప్పుడు అడిలైడ్‌కు వెళ్లి 55 వారాలపాటు పైలట్ శిక్షణ తీసుకోనున్నట్లు వివరించాడు. సాధారణంగా చాలా మంది క్రికెటర్లు కనీసం 30ఏళ్లు దాటిన తర్వాతనే ఆటకు గుడ్‌బై చెబుతుంటారు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అయిన కార్టర్‌ 2015లో హాంకాంగ్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అతను 11 వన్డేలు, 10 టీ20లు ఆడాడు.

Story first published: Wednesday, October 3, 2018, 12:37 [IST]
Other articles published on Oct 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X