న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం కోసం కెప్టెన్ పదవికి రాజీనామా

Hong Kong captain Anshuman Rath resigns, to play first-class cricket in India

హైదరాబాద్: భారత్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం కోసం హాంకాంగ్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తోన్న అన్షుమాన్ రత్ రాజీనామా చేశాడు. 21 ఏళ్ల అన్షుమాన్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం విశేషం. ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడాలన్న ఉద్దేశ్యంతోనే తన కెప్టెన్సీనికి రాజీనామా చేసినట్లు అన్షుమాన్ చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా అన్షుమాన్ మాట్లాడుతూ "గత కొన్నేళ్లుగా నా కోసం చేసిన ప్రతిదానికీ హాంకాంగ్ క్రికెట్‌కు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. 12 ఏళ్ల వయసు నుంచే ఆనందించే రైడ్‌ను ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఆటగాళ్ళు, సహాయక సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి భవిష్యత్ ప్రయత్నాలపై నిశితంగా గమనిస్తాను" అని అన్నాడు.

టిమ్ టాస్ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది: రికీ పాంటింగ్టిమ్ టాస్ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది: రికీ పాంటింగ్

ఐపీఎల్ 2020 వేలంలోకి అన్షుమాన్ రత్ లోకల్ ఆటగాడిగా ప్రవేశించాలని అనుకుంటున్నాడు. కాగా, ఇప్పటివరకు 15 వన్డేలు ఆడిన అన్షుమాన్ 51.75 యావరేజిని కలిగి ఉన్నాడు. అదే విధంగా 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 65 యావరేజితో 391 పరుగులు చేశాడు. వచ్చే సీజన్‌లో ఐపీఎల్‌లో ఆడాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు.

"ఐపీఎల్‌లో గనుక చోటు దక్కితే పూర్తి ప్రొపేషనల్ ప్లేయర్‌గా ఆడేందుకు అవకాశం లభిస్తుంది. టెస్టు క్రికెట్‌లో ఆడాలన్ని తన డ్రీమ్ అని... ఇంగ్లీషు సిస్టమ్‌లో నా అవకాశానికి తప్పుగా ప్రారంభడంతో ఇప్పుడు అన్ని అవకాశాలను బాగా పరిశీలిస్తున్నాను" అని అన్షుమాన్ రత్ తెలిపాడు.

ఇంగ్లీషు కౌంటీల్లో మిడిల్సెక్స్ జట్టు అన్షుమాన్‌తో ఒప్పందం చేసుకున్నప్పటికీ... వీసా రాకపోవడంతో ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించలేకపోయాడు. ఐసీసీలో పూర్తి సభ్యత్వం ఉన్న దేశాలకు మాత్రమే వీసా లభిస్తుంది. ఐసీసీలో హాంకాంగ్‌కు పూర్తి సభ్యత్వం లేని కారణం చేత అతడు ఆ అవకాశాన్ని మిస్సయ్యాడు.

టెస్టు క్రికెట్‌కు బ్రేక్‌ ఇచ్చిన వహాబ్‌ రియాజ్.. ఇక గుడ్‌ బై చెప్పినట్లేనా?టెస్టు క్రికెట్‌కు బ్రేక్‌ ఇచ్చిన వహాబ్‌ రియాజ్.. ఇక గుడ్‌ బై చెప్పినట్లేనా?

"నేను జన్మించిన స్థలానికే ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వపడతాను. హాంకాంగ్‌ జట్టులో సంపాదించిన సామర్థ్యం, అనుభవం రెండింటిలోనూ నాకున్న అవకాశాల గురించి నేను పూర్తిగా నిజాయితీగా ఉండాలి. అన్ని ఫార్మాట్లకు తగ్గట్లుగా నన్ను నేను మలచుకుంటున్నాను. సుదీర్ఘ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని భారత్‌కు ఆడాలని నిర్ణయం తీసుకున్నా" అని అన్షుమాన్ తెలిపాడు.

Story first published: Friday, September 13, 2019, 16:25 [IST]
Other articles published on Sep 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X