న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీచర్స్ డే రోజున ఆచ్రేకర్‌ గురించి సచిన్ ఎమోషనల్ ట్వీట్

His Lessons Continue To Guide Me Today: Sachin Tendulkar Remembers Ramakant Achrekar On Teachers Day

హైదరాబాద్: టీచర్స్ డే రోజున క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన దివంగత గురువు రమాకాంత్ ఆచ్రేకర్‌ను గుర్తు చేసుకున్నాడు. రమాకాంత్ ఆచ్రేకర్ బ్యాటింగ్ టెక్నిక్ నేర్పిస్తోన్న ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్తు చేసి ఆయన పాఠాలు ఇప్పటికీ తనని మార్గదర్శకం చేస్తున్నాయని తెలిపాడు.

జోఫ్రా నీ పాస్ పోర్టు చూపించు: ఆర్చర్‌ను గేలి చేసిన ఆస్ట్రేలియా అభిమానులుజోఫ్రా నీ పాస్ పోర్టు చూపించు: ఆర్చర్‌ను గేలి చేసిన ఆస్ట్రేలియా అభిమానులు

"టీచర్స్ కేవలం చదువే కాదు.. విలువలు కూడా నేర్పిస్తారు. మైదానంలో, జీవితంలోనూ నేరుగా ఆడటాన్ని అచ్రేకర్‌ సర్ నేర్పించారు. ఆయన నేర్పించిన పాఠాలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇప్పటికీ ఆయన పాఠాలే నాకు మార్గదర్శకంగా ఉన్నాయి" అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.

టీచర్స్ డేను భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబర్ 5వ తేదీన ప్రతి ఏటా జరుపుకుంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చాలామందికి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా అందరికీ తెలిసిందే. కానీ, ఆయన మొదట ఉపాధ్యాయుడు. స్వాతంత్ర్యం తర్వాత తొలి ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ నియమితులయ్యారు.

పదేళ్లు ఉపరాష్ట్రపతిగా సేవలందించిన తర్వాత ఆయన 1962లో రాష్ట్రపతిగా నియమింపబడ్డారు. ఓ ఉపాధ్యాయుడు రాష్ట్రపతి పదవిలో కూర్చోవడం ఆ వృత్తికే గర్వకారణం. అందుకే 1962 నుంచి ఆయన పుట్టిన రోజునే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. 1931లోనే భారతరత్న పురస్కారం అందుకున్నారు.

Story first published: Thursday, September 5, 2019, 14:59 [IST]
Other articles published on Sep 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X