న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kohli's Chinese Fan : విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు ఫిదా.. భారత మాతకు జై కొట్టిన చైనా యువకుడు

hindi speaking chinese fan of virat kohli cheer for india

క్రికెట్ ఒక గ్లోబల్ స్పోర్ట్. దీన్ని అభిమానించడానికి దేశ సరిహద్దులతో పనిలేదు. బంతి బంతికీ పెరిగే ఉత్కంఠ ఎలాంటి వారికైనా సరే టెన్షన్‌ తెప్పిస్తుంది. అందుకే క్రికెట్ ఆడని దేశాల్లో కూడా ఈ ఆటకు అభిమానులు ఉన్నారు. ఇదే విషయాన్ని నిరూపించాడో యువకుడు. బుధవారం నాడు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే ఒక వ్యక్తి అక్కడి క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించాడు.

అందరి చూపూ అతని వైపే..

అందరి చూపూ అతని వైపే..

అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు మద్దతుగా నిలిచాడా యువకుడు. అతను చెక్కిళ్లపై మువ్వన్నెల పతాకం పెయింట్ చూస్తేనే ఆ విషయం తెలిసిపోతోంది. కానీ అతను మాత్రం భారతీయుడు కాకపోవడం గమనార్హం. చైనాకు చెందిన సదరు యువకుడు అడిలైడ్ యూనివర్సిటీలో లాంగ్వేజెస్ చదువుతున్నాడట. పేరు చెప్పమంటే చెప్పలేదు కానీ.. తనకు భారత దేశం అన్నా, అక్కడి సంస్కృతి అన్నా చచ్చేంత ఇష్టమని మాత్రం చెప్పాడా యువకుడు. అంతేకాదు, తనకు క్రికెట్‌లో కోహ్లీ అంటే తెగ అభిమానమని అన్నాడు. హిందీలో చక్కగా మాట్లాడిన ఈ చైనీయుడు.. 'మై ఇండియన్ టీమ్ కీ భక్త్ హూ. ముఝే భారతీయ సంస్కృతి బహుత్ పసంద్ హై' (నేను భారత జట్టు భక్తుడిని. నాకు భారత సంస్కృతి అంటే చాలా ఇష్టం) అని చెప్పాడు.

భారత్ మాతా కీ జై..

భారత్ మాతా కీ జై..

ఈ క్రమంలోనే తనకు విరాట్ కోహ్లీ అంటే అభిమానమని, తన ఆట బాగా నచ్చుతుందని చెప్పాడీ చైనీస్ ఫ్యాన్. అతని ఉత్సాహం చూసిన నెటిజన్లు బంగ్లాదేశ్, భారత్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నావ్? అని అడిగారు. ఆ ప్రశ్న విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా 'భారత్.. భారత్' అంటూ ఉత్సాహంగా సమాధానం చెప్పాడా చైనీస్ కుర్రాడు. తనకు భారత్ అంటే చాలా ఇష్టమని, అందుకే హిందీ నేర్చుకున్నానని వివరించాడు. చివరగా 'భారత్ మాతా కీ జై' అని నినదించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఫ్యాన్ కోరిక తీర్చిన కోహ్లీ

ఈ చైనా కుర్రాడి ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. 44 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనితోపాటు కేఎల్ రాహుల్ (50) కూడా రాణించడంతో తొలుతు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 184 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌ను ధాటిగా ఆరంభించిన బంగ్లాదేశ్.. వేగంగా లక్ష్యం దిశగా సాగింది. అయితే వర్షం అంతరాయం కలిగించిన తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయింది. భారత బౌలర్లు పుంజుకొని క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది.

Story first published: Thursday, November 3, 2022, 12:39 [IST]
Other articles published on Nov 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X