ఇప్పటివరకు..రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలుస్తోంది

Posted By:
 Highlights Sri Lanka vs Bangladesh, Nidahas Trophy 2018, 3rd T20I at Colombo, Full Cricket Score: Tigers clinch thriller to register first win

హైదరాబాద్: శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో కనిపించని సెంటిమెంట్ ఒకటి బలంగా నడుస్తోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ముగియగా.. మూడింట్లోనూ ఛేదనకు దిగిన జట్టే విజేతగా నిలిచింది. ఎలా అంటే.. భారీ టార్గెట్‌ను సైతం పసికూన బంగ్లాదేశ్‌ జట్టు ఛేదించి విజేతగా నిలిచింది.

 టోర్నీలో నాలుగో మ్యాచ్:

టోర్నీలో నాలుగో మ్యాచ్:

శనివారం రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏకంగా 215 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసిన విషయం తెలిసిందే. దీంతో ఛేదనవైపే అన్ని జట్లు మొగ్గు చూపుతుండగా.. సోమవారం రాత్రి 7 గంటలకి భారత్, శ్రీలంక మధ్య టోర్నీలో నాలుగో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించే అవకాశం ఉంది.

 వాతావరణం అనుకూలించకే:

వాతావరణం అనుకూలించకే:

రాత్రివేళ మంచు కురుస్తుండటంతో.. బౌలర్లకి ఏమాత్రం బంతిపై పట్టుదొరకడం లేదు. బౌలర్లు ఎక్కువగా హైట్ నోబాల్స్ వేస్తుండటమే దీనికి నిదర్శనం. ఇదే.. ఛేదన సమయంలో బ్యాట్స్‌మెన్‌కి వరంగా మారుతోంది. మైదానం కూడా చిన్నదిగా ఉండటంతో.. యథేచ్ఛగా సిక్సర్లు బాదేస్తున్నారు.

 పిచ్‌పై అలవోకగా బ్యాట్ ఝళిపించి:

పిచ్‌పై అలవోకగా బ్యాట్ ఝళిపించి:

శనివారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ 10 సిక్సర్లు కొట్టగా.. బంగ్లాదేశ్ 12 సిక్సర్లు బాదేసింది. టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు ఆర్. ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతుండటం కూడా బ్యాట్స్‌మెన్‌కి ఇక్కడ కలిసొస్తోంది. అలవాటైన పిచ్‌పై అలవోకగా బ్యాట్ ఝళిపించేస్తున్నారు.

 శ్రీలంక అలవోకగా:

శ్రీలంక అలవోకగా:

తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 174 పరుగులు చేయగా.. శ్రీలంక జట్టు 18.3 ఓవర్లోనే అలవోకగా ఛేదించేసింది.

టీమిండియా 18.4 ఓవర్లలోనే:

టీమిండియా 18.4 ఓవర్లలోనే:

భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 139 పరుగులు చేయగా.. టీమిండియా 18.4 ఓవర్లలోనే ఛేదించేసింది.

బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో ఛేదించేసి:

బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో ఛేదించేసి:

మూడో మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 214 పరుగుల భారీ స్కోరు చేయగా.. పసికూన బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో ఛేదించేసి ఔరా అనిపించింది. దీంతో.. ఛేదనకు దిగిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Story first published: Monday, March 12, 2018, 14:38 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి