ఆ విషయంలో విరాట్ కోహ్లీని ధాటేసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బద్దలుకొట్టాడు. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో పాక్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 53 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ సిరీస్‌లో బాబర్ ఆజామ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. వరుసగా 103, 77, 1 పరుగులతో రాణించాడు. దాంతో వన్డేల్లో కెప్టెన్‌గా అత్యధిక యావరేజ్ కలిగిన ప్లేయర్‌గా గుర్తింపుపొందాడు.

కెప్టెన్‌గా 1082 రన్స్ చేసిన బాబర్ యావరేజ్ 90.16‌గా ఉంది. ఈ క్రమంలోనే 1000కి పైగా పరుగులు చేసిన జాబితాలో బాబర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీని వెనక్కినెట్టాడు. విరాట్ కోహ్లీ 72.65తో 5449 రన్స్ చేశాడు. ఏబీ డివిలియర్స్ 63.94 సగటుతో 4796 పరుగులు చేశాడు. ఫాఫ్ డుప్లెసిస్ 57.62 సగటుతో 1671 పరుగులు చేసాడు.

మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్లకు 269 పరుగులు చేసింది. బాబర్ ఆజామ్(1) విఫలమవ్వగా.. ఇమామ్ ఉల్ హక్(62), షాదాబ్ ఖాన్(86) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. 37.2 ఓవర్లలో 216 పరుగులకు కుప్పకూలింది. షాదాబ్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగగా.. మహమ్మద్ నవాజ్, హసన్ అలీ రెండేసి వికెట్లు పడగొట్టారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, June 13, 2022, 9:45 [IST]
Other articles published on Jun 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X