న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నెటిజన్ ప్రశ్న: అలియా భట్ ఎవరో తెలియదన్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

Herschelle Gibbs doesn’t know who Alia Bhatt is; she later responds

హైదరాబాద్: రష్యా టెన్నిస్ స్టార్ ఒకానొక సందర్భంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎవరో తనకు తెలియదు? అని చెప్పిన సంఘటనను సగటు భారత క్రికెట్ అభిమాని ఇప్పటికీ మరిచిపోడు. ఎందుకంటే ఎప్పుడైతే సచిన్ తనకు తెలియదని చెప్పిందో? ఆ మరుక్షణమే షరపోవాను భారత క్రికెట్ అభిమానులు ఏకీపారేశారు.

<strong>అఫీసియల్: అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మారనున్న ఫిరోజ్ షా కోట్లా </strong>అఫీసియల్: అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మారనున్న ఫిరోజ్ షా కోట్లా

నీ దేశంలో నువ్వు పెద్ద సెలబ్రిటీ అయి ఉండొచ్చు గాక... మిగతా దేశాల్లో సైతం నీకు అభిమానులు ఉండొచ్చు. అయితే, ప్రతి ఒక్కరూ నిన్ను గుర్తుపట్టాలని లేదు కదా. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్షెల్ గిబ్స్ బాలీవుడ్ నటి అలియా భట్ ఇమేజి తన ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

సోమవారం హెర్షెల్ గిబ్స్ తన ట్విట్టర్‌లో "మార్నింగ్... పక్షులు ట్వీట్ చేస్తున్నాయి. నేను కూడా అదే చేస్తాను, అయితే మంచి వాటిని కలిగి ఉంటాను" అని ట్వీట్ చేశాడు. గిబ్స్ పోస్టు చేసిన ఈ ట్వీట్‌ను ట్విట్టర్ లైక్ చేయడంతో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ "ట్విట్టర్ నీ ట్వీట్‌ను లైక్ చేసినప్పుడు మీ ఫీలింగ్" అంటూ అలియా భట్ నవ్వుతూ ఉన్న GIF ఇమేజిని పోస్టు చేశాడు.

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ GIF ఇమేజిలో ఉన్న అమ్మాయి నీకు తెలుసా? అంటూ ప్రశ్నించాడు. దీనికి గిబ్స్ "నాకు తెలియదు.. ఆమె ఎవరు?" అంటూ మరోసారి ట్విట్టర్‌లో స్పందించాడు. మరో ట్వీట్‌లో "మీరు నటి అని తెలియదు. కానీ GIF చాలా బాగుంది" అంటూ ఆలియా భట్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశాడు.

దీంతో చివరకు ఆలియా భట్ తన ట్విట్టర్‌లో నవ్వుతూ ఉన్న ఎమోజీని పోస్టు చేస్తూ అంఫైర్ బౌండరీ బాదితే ఎలాంటి సిగ్నల్‌ ఇస్తాడో అలాంటి సిగ్నల్‌ను కలిగి ఉన్న ఇమేజి ట్వీట్ చేయడం విశేషం. అప్పుడు గిబ్స్‌ 'నేను సిక్సర్లతోనే డీల్‌ చేస్తాను మేడమ్‌ ఫోర్లతో కాదు..' అని బదులిచ్చాడు. ఇంటర్నెట్‌లో వీరి సంభాషణ వైరల్‌గా మారింది. కాగా, దక్షిణాఫ్రికా తరుపున గిబ్స్ 90 టెస్టులు, 248 వన్డేలు, 23 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.

<strong>ప్రొ కబడ్డీ లీగ్‌ 2019.. ఈ వారంలో టాప్ 3 రైడ్‌లు ఇవే!! (వీడియో)</strong>ప్రొ కబడ్డీ లీగ్‌ 2019.. ఈ వారంలో టాప్ 3 రైడ్‌లు ఇవే!! (వీడియో)

2010లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గిబ్స్ 2012లో తన చివరి ఐపీఎల్ గేమ్‌ను ఆడాడు. అంతేకాదు వన్డేల్లో ఒక ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన మొట్టమొదటి క్రికెట్ కూడా గిబ్సే.

Story first published: Tuesday, August 27, 2019, 21:49 [IST]
Other articles published on Aug 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X