న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: బెంగుళూరులో జరగనున్న ఐపీఎల్ వేలం పూర్తి వివరాలు

Here's your complete guide to IPL 2018 Auction in Bengaluru

హైదరాబాద్: క్రికెట్ అభిమానుల నుంచి ప్లేయర్ల వరకు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తోన్న ఐపీఎల్‌లో మొదటి దశ ఆరంభమైంది. ఇక శనివారం, ఆదివారంతో ఏ జట్టు తరపున ఎవరెవరు ఆడబోతున్నారో తేలేందుకు 24 గంటల సమయం మాత్రమే ఉంది.

బీసీసీఐ కేవలం 578మందిని మాత్రమే: వెయ్యికి పైగా క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు పోటీపడినా బీసీసీఐ కేవలం 578మందిని మాత్రమే వేలానికి ఆమోదించింది. పైగా వీరందరిలో గరిష్ఠ ధర 2 కోట్లుగా పేర్కొంది. ఈ వేలంలో రెండు జట్లు మాత్రం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టనున్నాయి. అంటే దాదాపు 67.5కోట్లకు పైగా ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. ఆ రెండు జట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్.

బెన్ స్టోక్స్‌కు అత్యధిక ధర: గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండ్ ఆటగాడైన బెన్ స్టోక్స్ అత్యధిక ధర పలికాడు. 14.5కోట్ల రూపాయలు పలికిన అతని ధర రైజింగ్ పూనె సూపర్ జయంట్ జట్టు చెల్లించింది. ఈ సంవత్సరం రైజింగ్ పూనె, గుజరాత్ లయన్స్ పోటీలో ఆడటం లేదు. వీటికి బదులుగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 2016, 2017 రెండు సంవత్సరాల విరామం తర్వాత పిచ్‌లోకి దూకనున్నాయి.


ఐపీఎల్ 11 గురించి పూర్తి వివరాలు:

1122: ఐపీఎల్‌లో ఆడేందుకు రిజిష్టర్ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య,


578: రిజిష్ట్రేషన్ అయిన సభ్యుల్లో నుంచి బీసీసీఐ 578కి కుదించింది.


360: ఐపీఎల్ సీజన్‌కు భారత్ నుంచి పాల్గొనబోతున్న ఆటగాళ్ల సంఖ్య


218: మొత్తం విదేశీ ఆటగాళ్ల సంఖ్య


244: క్యాప్‌డ్ ప్లేయర్లు (182 మంది విదేశీలు, 62 మంది భారతీయులు)


332: అన్ క్యాప్‌డ్ ప్లేయర్లు (298 మంది భారతీయులు, 34 మంది విదేశీయులు)


2: అసోసియేట్ దేశాలైన (కెనడా, నేపాల్) ఆటగాళ్ల సంఖ్య


18: వేలానికి ముందే అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల సంఖ్య


182: వేలంలో అందుబాటులో ఉండే గరిష్ట ఆటగాళ్ల సంఖ్య


25: ఎనిమిది మంది విదేశీయులతో కలిపి జట్టులో ఉండాల్సిన ఆటగాళ్ల గరిష్ఠ సంఖ్య


36(విదేశీలు 23, భారతీయులు 13: ఆటగాళ్లలో గరిష్ఠంగా 2కోట్ల రూపాయల ధరను కలిగి ఉన్న వాళ్లు


32: 1.5 కోట్ల ధరను ప్రకటించిన ఆటగాళ్లు


31: కోటి రూపాయలను ధరగా ప్రకటించిన ఆటగాళ్లు


23: ప్రారంభ ధర 75 లక్షలుగా ఉన్న ఆటగాళ్లు


122: ప్రారంభ ధర 50 లక్షలుగా ఉన్న క్రీడాకారులు


0: పాకిస్థాన్ తరపు నుంచి ఆడుతున్న ఆటగాళ్ల సంఖ్య

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 27, 2018, 8:54 [IST]
Other articles published on Jan 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X