న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ, బిగ్ బి కారణమా?: తొలగింపుపై భోగ్లే ఏమన్నారు?

న్యూఢిల్లీ: ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లేకు ఉద్వాసన పలకడం వివాదాస్పదంగా మారుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యాఖ్యాతగా భోగ్లేను బీసీసీఐ తొలగించడం వెనక కారణమేంటన్నది అంతుబట్టడటం లేదు. సరైన కారణమేంటో చెప్పకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ).. భోగ్లేను ఉన్నపళంగా ఎందుకు తప్పించారనే దానిపై విస్తృత చర్చ జరుగుతోంది.

కాగా, ఐపీఎల్‌ వ్యాఖ్యాతగా తనను ఎందుకు తప్పించారో ఇప్పటికీ అర్థం కావట్లేదంటున్నాడు హర్ష భోగ్లే. అయితే ఆటగాళ్ల ఫిర్యాదు తనపై వేటుకు కారణం కాదని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

'ఐపీఎల్‌ కామెంట్రీకి ఎందుకు దూరమయ్యానో నాకు ఇప్పటికీ తెలియదు. నాకెవరూ చెప్పలేదు. కొందరు నన్ను ఇష్టపడరన్న వాస్తవాన్ని నేను అంగీకరించగలను. కానీ, క్రికెటర్లు నా వ్యాఖ్యానం గురించి ఫిర్యాదు చేయలేదని నేను నిజంగా ఆశిస్తున్నా' అని భోగ్లే అన్నాడు.

Here is what Harsha Bhogle said on his IPL 2016 contract termination

భోగ్లే వ్యాఖ్యానంపై బీసీసీఐకి ఆటగాళ్లు ఫిర్యాదు చేశారన్న ఊహాగానాల నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, భోగ్లేను తప్పించడం వెనక టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్ల ప్రమేయముందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

భోగ్లేకు వ్యతిరేకంగా జట్టులోని కొందరు సీనియర్ క్రికెటర్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారనీ, అందుకే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఓ మీడియా కథనం ప్రకా రం.. ప్రధానంగా కెప్టెన్ ధోనీ, సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్‌లు భోగ్లే పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఫేవరెట్ అనుకున్న టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌లాంటి జట్టుతో మ్యాచ్‌లో గెలుపొందిన తీరును భోగ్లే ఒకింత విమర్శనాత్మక ధోరణిలో వ్యాఖ్యానించడాన్ని ఈ ముగ్గురు క్రికెటర్లు తప్పుపడుతున్నారు.

అందుకే, ఈ ముగ్గురు ఇటీవల మీడియా సమావేశాల్లో కాస్త కఠువుగా, వ్యంగ్యంగా సమాధానాలివ్వడాన్ని గుర్తుచేస్తున్నారు. దీనికితోడు, బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిసాక.. కొందరు భారత కామెంటేటర్లు మన ఆటగాళ్ల గురించి గాకుండా ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్ల గురించి బాగా మాట్లాడుతున్నారంటూ భోగ్లేను పరోక్షంగా ప్రస్తావిస్తూ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేయడం.. ఆ తర్వాత అమితాబ్ ట్వీట్‌ను ధోనీ దీనికి చెప్పేదేమీ లేదు అంటూ రీట్వీట్ చేసిన నేపథ్యంలోనే భోగ్లేను బిసిసిఐ తప్పించినట్లు తెలుస్తోంది.

I must confess I am a little uncomfortable with all the attention I have been getting recently. I am just a cricket...

Posted by Harsha Bhogle onMonday, April 11, 2016

అయితే, జట్టులోని సీనియర్ ఆటగాళ్లే కారణమని వార్తలు వినిపిస్తున్నాయన్న దానిపై హర్షా భోగ్లే స్పందిస్తూ, పాతతరం జట్టులోని ఆటగాళ్లయిన సచిన్, గంగూలీ, లక్ష్మణ్, ద్రవిడ్, సచిన్‌లు కూడా తనపై ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపాడు. కామెంటరీ విషయాన్ని వాళ్లెప్పుడూ పట్టించుకోలేదని బదులిచ్చాడు. తనను తొలగించడం వెనక కారణమేంటన్నది తనకిప్పటికీ అంతుబట్టడం లేదని భోగ్లే చెప్పుకొచ్చాడు.

భోగ్లేకు పెరుగుతున్న మద్దతు

సోషల్ మీడియాలో కొందరు సెలెబ్రిటీలతో సహా క్రికెట్ అభిమానులంతా భోగ్లేకు మద్దతుగా నిలుస్తున్నారు. బీసీసీఐని మండిపడుతున్నారు. ఓ అభిమానైతే, 'కామెంటరీ బాక్స్ నుంచి కవిత్వాలను తొలగించండి, కానీ ప్రతిభను కాదు' అని పరోక్షంగా నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూను తప్పించండి కానీ, హర్షాభోగ్లేలాంటోళ్లను కాదని పోస్ట్ చేసి బోర్డుకు చురకంటించాడు.

ఇక బాలీవుడ్ నటుడు రిషికపూర్ కూడా భోగ్లేను మళ్లీ వ్యాఖ్యాతగా తీసుకోవాలని ట్వీట్ చేశాడు. ఇక టీమ్ ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా భోగ్లేను మళ్లీ తీసుకురావాలన్నాడు. 'ఇతర జట్లను పొగిడినందుకు హర్షా భోగ్లేను తొలగిస్తారా? మరి.. అతను రెండు దశాబ్ధాలుగా టీమిండియాకు తనదైన వ్యాఖ్యానంతో మద్దతిస్తున్నాడుగా! క్రికెట్‌కు మళ్లీ హర్షా వ్యాఖ్యానం కావాల్సిందే' జడేజా పేర్కొన్నాడు.

'క్రికెట్ పిచ్చి అభిమానిగా చెబుతున్నాను.. మైక్ ముందు హర్షాభోగ్లే కనిపించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. అతను స్టార్ కామెంటేటర్. బీసీసీఐ తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలి' బాలీవుడ్ నటుడు రిషీకపూర్ కోరారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X