బీసీసీఐ కొత్త కాంట్రాక్టులో స్థానం కోల్పోయిన క్రికెటర్లు వీరే

Posted By:
Team India get salary hike : Here's why Dhoni not given the Top Grade
Here is the list of Indian players who missed out on annual contracts 2017-18

హైదరాబాద్: బీసీసీఐ కొత్త కాంట్రాక్టుల జాబితా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(సీఓఏ) చేతుల మీదుగా విడుదల చేసింది. ఏ ప్లస్‌తో పాటు మూడు గ్రేడులుగా విభజించి జీతాలు పెంచాలనే ఆలోచనలో ఉందంటూ ముందుగానే సమాచారం అందినా అధికారికంగా బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. మూడు సిరీస్‌లు ఆడేవారిని ఏ కేటిగిరి కిందా, కేవలం రెండు సిరీస్ లు మాత్రమే ఆడేవారిని బీ కేటగిరిలోనూ, ఒక్క సిరీస్‌లో మాత్రమే ఆడేవారిని సీ కేటగిరిలోనూ కేటాయించింది బీసీసీఐ.

ఈ కాంట్రాక్టు ప్రక్రియలో గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం కీలకమైన ఆటగాళ్లు దూరమైయ్యారనే చెప్పాలి. కొందరు మాత్రం మంచి స్థానాలను కొట్టాశారు. 2014 నుంచి టెస్టు మ్యాచ్ లకు దూరమైన ధోనీ పారితోషికాల విషయంలో వెనుకపడ్డాడనే చెప్పాలి.


గతేడాది కాంట్రాక్టుల విషయంలో చోటు కోల్పోయిన ప్రధానమైన ఆటగాడు యువరాజ్ సింగ్. ఇప్పుడు గ్రేడ్ బీకి చేరుకున్నాడు. గతేడాది కోటి రూపాయల వరకు అందుకున్న యువరాజ్ సింగ్ ఈ ఏడాది బీ గ్రేడ్‌కు చేరుకుని అదే వేతనాన్ని అందుకోనున్నాడు. అయితే అతను జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవాలన్న ఆశ మాత్రం ఆపుకోలేకపోయాడు.

కాంట్రాక్టు ప్రక్రియలో చూస్తే ప్రధానంగా శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్‌కు ఎలాంటి గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వకపోవడం గమనార్హం. దక్షిణాఫ్రికా పర్యటన ముందు వరకు బాగానే ఆడిన ఆటగాళ్లు సఫారీ గడ్డపై రాణించలేకపోయారు. ఇదే తీరులో సఫారీ గడ్డపై ఒక్క మ్యాచ్ మినహాయించి ఇక దేనిలోనూ స్కోరును చేయలేకపోయిన రోహిత్‌కు మాత్రం 700% వరకు జీతాన్ని పెంచింది బీసీసీఐ.

కాంట్రాక్టు కోల్పోయిన వాళ్ల వివరాలు:
1. యువరాజ్ సింగ్ గ్రేడ్ బీ రూ. 1 కోటి
2. అంబటి రాయుడు గ్రేడ్ సీ రూ. 50లక్షలు
3. అమిత్ మిశ్రా గ్రేడ్ సీ రూ. 50లక్షలు
4. ఆశిష్ నెహ్రా గ్రేడ్ సీ రూ. 50లక్షలు
5. మన్‌దీప్ సింగ్ గ్రేడ్ సీ రూ. 50లక్షలు
6. ధావల్ కుల్‌కర్ణి గ్రేడ్ సీ రూ. 50లక్షలు
7. శార్దూల్ ఠాకూర్ గ్రేడ్ సీ రూ. 50లక్షలు
8. రిషబ్ పంత్ గ్రేడ్ సీ రూ. 50లక్షలు

Story first published: Thursday, March 8, 2018, 15:32 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి