న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PHOTOS: క్రికెట్‌లో వింత!: బౌలర్ హెల్మెట్ ధరించడం ఎప్పుడైనా చూశారా?

Helmets For Bowlers? New Zealands Andrew Ellis Wear Helmet While Bowling

హైదరాబాద్: క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. అలాంటి జెంటిల్మెన్ గేమ్‌లో కొన్ని సార్లు వింత సంఘటనలు జరుగుతుంటాయి. గతేడాది న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వేదికగా జరిగిన ఓ దేశవాళీ టోర్నీలో నమోదైన ఓ సిక్సు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే.

సిక్సులంటే బ్యాట్స్‌మెన్ బాదిన బంతి అమాంతం గాల్లో బౌండరీ అవతల పడుతుంది. కానీ, ఆ మ్యాచ్‌లో ఆక్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జీత్‌ రావల్‌ కొట్టిన బంతి బౌలర్ ఆండ్రూ​ ఎల్లిస్‌ తలను బలంగా తాకి బౌండరీ అవతల పడింది. తొలుత అంపైర్‌ ఫోర్‌ ఇవ్వగా రిప్లేలో సిక్స్‌ అని తేలడంతో అందరు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

PHOTO: మిడిల్ స్టంప్ విరిగింది: నెట్స్‌లో ప్రాక్టీస్ షురూ చేసిన బుమ్రాPHOTO: మిడిల్ స్టంప్ విరిగింది: నెట్స్‌లో ప్రాక్టీస్ షురూ చేసిన బుమ్రా

బంతి తలను తాకకుండా

బంతి తలను తాకకుండా

బంతి బౌలర్ తలను బలంగా తాకడంతో ఒక్కసారిగా మైదానంలోని ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు. ఎల్లిస్‌కు ఎలాంటి గాయం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు న్యూజిలాండ్‌లో ఆ దేళవాళీ టోర్నీ మళ్లీ మొదలైంది. అయితే, ఈసారి బంతి తన తలను తాకకుండా ఉండేందుకు క్యాంటెర్‌బరీ బౌలర్ ఆండ్రూ​ ఎల్లిస్‌ జాగ్రత్తపడ్డాడు.

హెల్మెట్ ధరించడం మంచిదే

హెల్మెట్ ధరించడం మంచిదే

ఆ జాగ్రత్త ఏంటంటే బౌలింగ్ సమయంలో హెల్మెట్ ధరించడం. టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన ఓ మ్యాచ్‌లో ఆండ్రూ ఎల్లిస్ హెల్మెట్ ధరించి బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాధారణంగా క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ లేదా వికెట్ కీపర్ మాత్రమే హెల్మెట్లు ధరిస్తారు.

తప్పేమీ కాదు

అందుకు భిన్నంగా ఆండ్రూ ఎల్లిస్ హెల్మెట్ ధరించడంతో మైదానంలో మ్యాచ్‌ని వీక్షిస్తోన్న అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఐసీసీ నిబంధన ప్రకారం బౌలింగ్ సమయంలో హెల్మెట్ ధరించడం తప్పేమీ కాదు. ఇందులో భాగంగానే ఆండ్రూ ఎల్లిస్ హెల్మెట్ ధరించాడు.

Story first published: Wednesday, November 27, 2019, 15:08 [IST]
Other articles published on Nov 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X