న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సొంతగడ్డపై మళ్లీ ఓడిన జింబాబ్వే: ఆసీస్‌ ఉత్కంఠ విజయం

By Nageshwara Rao
Head and Maxwell combine as Australia scrape past Zimbabwe

హైదరాబాద్: సొంతగడ్డపై ముక్కోణపు టి20 టోర్నీ సిరిస్‌లో ఆతిథ్య జింబాబ్వేకు ఒక్క విజయం కూడా దక్కలేదు. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది.

జింబాబ్వే ఆటగాళ్లలో సాల్మన్‌ మిరే (63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా వారంతా తక్కువ స్కోర్లకే పరమితమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసి గెలిచింది.

ఆసీస్ బ్యాట్స్‌‌మెన్లలో మాక్స్‌వెల్‌ (38 బంతుల్లో 56; 1 ఫోర్, 5 సిక్సర్లు), ట్రావిస్ హెడ్‌ (42 బంతుల్లో 48; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 71 బంతుల్లోనే 103 పరుగులు జోడించారు. చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా విజయానికి ఏడు పరుగులు అవసరమయ్యాయి.

ఈ సమయంలో తిరిపానో తొలి రెండు బంతులను వైడ్‌గా వేయడం జింబాబ్వేను దెబ్బతీసింది. ఆ తర్వాత 4 బంతుల్లో 3పరుగులే ఇచ్చినా ఐదో బంతిని స్టొయినిస్‌ ఫోర్‌గా మలచడంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఓడి జింబాబ్వే ఈ సిరిస్ నుంచి నిష్క్రమించింది.

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆండ్రూ టై (3/28)కి 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. టోర్నీలో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

Story first published: Saturday, July 7, 2018, 9:56 [IST]
Other articles published on Jul 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X