న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ కన్నుమూత

Former India Cricket Captain Ajit Wadekar No More
He was a father figure to the team, Anil Kumble pays tribute to Ajit Wadekar

ముంబై: భారత మాజీ టెస్ట్‌ కెప్టెన్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ వాడేకర్‌ (77) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దక్షిణముంబైలోని జస్లోక్ దవాఖానాలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌ అయిన వాడేకర్‌ మూడో స్థానంలో దిగేవారు. స్లిప్‌లో చురుకైన ఫీల్డర్‌ కూడా. భారత్‌ తొలి వన్డే జట్టులోనూ వాడేకర్‌ సభ్యుడు కావడం విశేషం.

వెస్టిండీస్, ఇంగ్లండ్‌లలో తొలిసారిగా

వెస్టిండీస్, ఇంగ్లండ్‌లలో తొలిసారిగా

ఆ మ్యాచ్‌లో 67 పరుగులతో రాణించారు. మొత్తం ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 237 మ్యాచ్‌ల్లో 47.03 సగటుతో 15,380 పరుగులు చేసిన వాడేకర్‌కు దూకుడైన ఆటగాడిగా పేరుంది. గవాస్కర్, విశ్వనాథ్‌ వంటి గొప్ప బ్యాట్స్‌మెన్, బేడి, ప్రసన్న, వెంకట్రాఘన్, చంద్రశేఖర్‌ వంటి దిగ్గజ స్పిన్నర్లున్న జట్టుకు వాడేకర్‌ కెప్టెన్సీ వహించారు. భారత్‌ ఆయన కెప్టెన్సీలోనే 1971లో వెస్టిండీస్, ఇంగ్లండ్‌లలో తొలిసారిగా టెస్టు సిరీస్‌లను గెలిచింది. 1972-73లో స్వదేశంలో ఇంగ్లండ్‌ను మరోసారి ఓడించింది. వరుసగా మూడు సిరీస్‌లు నెగ్గడంతో కెప్టెన్‌గా వాడేకర్‌ పేరు మార్మోగిపోయింది.

3 టెస్టుల్లోనూ ఓడటంతో రిటైర్మెంట్‌

3 టెస్టుల్లోనూ ఓడటంతో రిటైర్మెంట్‌

1974లో ఇంగ్లాండ్‌లో పర్యటించిన జట్టుకూ కెప్టెన్సీ వహించిన ఆయన ఆ సిరీస్‌లో జట్టు మూడు టెస్టుల్లోనూ ఓడటంతో రిటైర్మెంట్‌ ప్రకటించారు. తన ఎనిమిదేళ్ల టెస్ట్‌ కెరీర్‌లో ఆడిన 37 టెస్ట్ మ్యాచ్‌ల్లో 14 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో మొత్తం 2113 పరుగులు చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కేవలం రెండు మ్యాచ్‌లే ఆడారాయన. క్రీడా రంగంలో ఆయన ప్రతిభకు గాను భారత ప్రభుత్వం 1967లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీలతో గౌరవించింది.

సీకే నాయుడు జీవిత సాఫల్యపురస్కారం

సీకే నాయుడు జీవిత సాఫల్యపురస్కారం

1990ల్లో అజహరుద్దీన్‌ కెప్టెన్సీలోని భారత జట్టుకు మేనేజర్‌ కమ్‌ కోచ్‌గా వ్యవహరించారు. సీకే నాయుడు జీవిత సాఫల్యపురస్కారం కూడా అజిత్‌వాడేకర్‌ అందుకున్నారు. 1998-99 మధ్యకాలంలో సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. లాలా అమర్‌నాథ్, చందూ బోర్డె తర్వాత ఆటగాడిగా, సారథిగా, కోచ్‌గా, సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా చేసిన మూడో వ్యక్తిగా రికార్డుల కెక్కారు.

 వాడేకర్‌కు ప్రముఖుల సంతాపం:

వాడేకర్‌కు ప్రముఖుల సంతాపం:

అజిత్‌ వాడేకర్‌ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విచారం వ్యక్తంచేశారు. వాడేకర్‌ మెరుగైన భారత క్రికెటర్‌ అని, 1971లో కెప్టెన్‌గా విదేశీగడ్డపై టెస్టుల్లో భారత్‌కు అద్భుత విజయాలు అందించారని కోవింద్‌ కొనియాడారు. వాడేకర్‌‌ మృతి బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత క్రికెట్‌ చరిత్రలో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా మరుపురాని విజయాలను అందించారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Story first published: Thursday, August 16, 2018, 9:55 [IST]
Other articles published on Aug 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X