న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఆసీస్ ఆటగాడు ఒకప్పటి నన్ను గుర్తు చేశాడు: సచిన్ టెండూల్కర్

‘He reminds me of me’ Sachin Tendulkar heaps praise on Marnus Labuschagne

సిడ్నీ: ఇటీవల నిలకడకే మారుపేరుగా రాణిస్తున్న ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మార్నస్ లబుషేన్‌పై టీమిండియా లెజెండ్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియా బుష్‌ఫైర్ బాధితుల సహయార్థం ఏర్పాటు చేసిన చారిటీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సచిన్ మాట్లాడుతూ.. ఆసీస్ క్రికెటర్ ప్రతిభను కొనియాడాడు. ప్రస్తుత తరం క్రికెట్‌ర్లలో ఎవరైనా మిమ్మల్ని మీకు గుర్తు చేశారా? అని సచిన్‌ను ప్రశ్నించగా.. మార్నలస్ లుబుషేన్‌లో ఒకప్పటి తనను చూసుకున్నానని తెలిపాడు. అతని ఫుట్ వర్క్ అద్బుతంగా ఉంటుందని, అచ్చం తనాలే ఉందన్నాడు. అందుకే లబుషేన్‌ తనని గుర్తు చేశాడంటున్నాని మాస్టర్ చెప్పుకొచ్చాడు.

లబుషేన్ ఆట మా బావతో చూశా..

లబుషేన్ ఆట మా బావతో చూశా..

‘యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో స్టీవ్ స్మిత్ గాయపడటంతో తొలి కంకషన్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్ ఆటను నేను మా బావతో కలిసి చూశాను. రెండో ఇన్నింగ్స్‌లో అతని బ్యాటింగ్ 15 నిమిషాలు చూడగానే లబుషేన్ ప్రత్యేక ఆటగాడనే విషయం అర్థమైంది. అతనిలో ఏదో స్పెషల్ ఉందనిపించింది. ఫుట్‌వర్క్ అనేది ఫిజిక‌ల్‌కు సంబంధించినది కాదు. మానసికమైనది. మీ ఆలోచనలు సానుకూలంగా లేకుంటే మీ పాదాలు ముందుకు కదలవు. ఇదే లబుషేన్ మానసిక బలం ఏంటో తెలియజేస్తుంది. మానసికంగా దృడంగా లేకుంటే ఫుట్‌వర్క్ సరిగ్గా ఉండదు. మార్నస్ ఫుట్‌వర్క్ అత్యుద్భుతం. 'అని సచిన్ కొనియాడాడు.

 కోచ్‌గా సచిన్

కోచ్‌గా సచిన్

ఆస్ట్రేలియా బుష్‌ఫైర్ బాధితుల సహయార్థం నిర్వహిస్తున్న బుష్‌ఫైర్‌ క్రికెట్‌ బాష్‌ మ్యాచ్‌కు సచిన్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ లెవెన్‌కు మాస్టర్ కోచ్‌గా సేవలందించనున్నాడు. ఈ చారిటీ మ్యాచ్ గురించి బ్రెట్‌లీ తనకు తెలియజేశాడని సచిన్ చెప్పుకొచ్చాడు. బాధితుల సహయార్ధం నిర్వహిస్తున్న ఈ మ్యాచ్ గురించి చెప్పగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఆస్ట్రేలియాకు వచ్చేందుకు ఒప్పుకున్నానని సచిన్ తెలిపాడు. బుష్ ఫైర్ చాలా భయంకరమైన విపత్తని, దీని వల్ల మనుషులే కాకుండా వన్య ప్రాణులకు ముప్పు వాటిల్లిందన్నాడు. అయితే ప్రజలు వాటి గురించి ప్రస్తావించరని, అవి కూడా ముఖ్యమేనని సచిన్ అభిప్రాయపడ్డాడు. బాధితుల సహయార్థం తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా సంతోషంగా ఉందన్నాడు.

మ్యాచ్ వాయిదా..

మ్యాచ్ వాయిదా..

ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్ధం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తలపెట్టిన ఛారిటీ మ్యాచ్‌ పోస్ట్‌పోన్‌ అయింది. కార్చిచ్చు బాధితుల సహాయార్థం నిర్వహించనున్న 'బుష్‌ఫైర్‌ క్రికెట్‌ బాష్‌' చారిటీ మ్యాచ్‌ శనివారానికి బదులు ఆదివారానికి వాయిదా పడింది. ఇక సిడ్నీలో జరగాల్సిన మ్యాచ్‌ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మెల్‌బోర్న్‌కు మారింది. సిడ్నీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో.. శనివారం నిర్వహించాల్సిన మ్యాచ్‌ను ఆదివారం జంక్షన్‌ ఓవల్‌ స్టేడియానికి సీఏ మార్చింది.

Story first published: Friday, February 7, 2020, 16:33 [IST]
Other articles published on Feb 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X