న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌కే ఆడతాడు... ఇంగ్లండ్‌కు కాదు: ట్రోలర్స్‌పై ఆమీర్ భార్య మండిపాటు

 He is proud Pakistani: Mohammad Amirs wife hits back at trolls questioning his loyalty

హైదరాబాద్: 27 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు పాక్ పేసర్ మహ్మద్ ఆమీర్ వీడ్కోలు పలకడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత తన భార్య వీసాతో ఆమీర్ లండన్‌లో సెటిల్ అవనున్నట్లు వార్తలు వచ్చాయి.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

లండన్‌లో ఇల్లు కొనే యోచనలో ఉన్నట్లు... ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు తరుపున ఆడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. తన భర్తపై వచ్చిన వార్తలపై ఆమీర్ భార్య నర్గీల్ మాలిక్ ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన భర్త నిజాయితీనే ప్రశ్నిస్తారా? అంటూ మండిపడ్డారు.

ట్విట్టర్‌లో ఆమీర్ భార్య ఇలా

"టెస్టు క్రికెట్‌కు ఆమీర్ రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయమై ఎవ్వరికీ సమాధానం చెప్పాల్పిన పనిలేదు. ప్రజలంతా ఆమిర్‌కు మద్దతుగా ఉన్నారు. ఇంగ్లండ్‌కు ఆడాల్సిన అవసరం ఆమిర్‌కు లేదు. పాకిస్తాన్‌కు తప్ప మరే దేశానికి ఆమిర్‌ ప్రాతినిథ్యం వహించడు. పాకిస్తాన్‌ తరఫున క్రికెట్‌ ఆడటాన్ని ఆమిర్‌ ఎంతగానో ఆస్వాదిస్తాడు. ఒకవేళ మా కూతురు క్రికెట్‌ ఆడాలనుకుంటే పాక్‌కే ఆడుతుంది కానీ ఇంగ్లండ్‌కు కాదు. ఆమిర్‌ రిటైర్‌ అయ్యింది కేవలం టెస్టు క్రికెట్‌ నుంచే కానీ, మొత్తం క్రికెట్‌ నుంచి కాదనే విషయం తెలుసుకోవాలి. వన్డేలు, టీ20ల్లో దేశం గర్వించేలా ఆమీర్‌ ఆడతాడు" అని నర్గీస్‌ ట్వీట్ చేశారు.

బ్రిటీష్‌ పౌరసత్వం కలిగిన నర్గీస్ మాలిక్‌

బ్రిటీష్‌ పౌరసత్వం కలిగిన నర్గీస్ మాలిక్‌

ఆమీర్ భార్య నర్గీస్ మాలిక్‌కు బ్రిటీష్‌ పౌరసత్వం ఉంది. మూడేళ్ల క్రితం వీరికి వివాహమైంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. కాగా, 2009, జులైలో గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన మహ్మద్ ఆమీర్ పాక్ తరుపున మొత్తం 36 టెస్టులాడాడు.

17 ఏళ్ల వయసులో టెస్టు అరంగేట్రం

17 ఏళ్ల వయసులో టెస్టు అరంగేట్రం

17 ఏళ్ల వయసులో టెస్టు అరంగేట్రం చేసిన ఆమీర్ 30.47 యావరేజితో మొత్తం 119 వికెట్లు తీశాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆమిర్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఫిక్సింగ్‌లో దోషిగా తేలడంతో అతడు 2010 నుంచి ఐదేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. కొంతకాలం జైలు జీవితాన్ని కూడా గడిపాడు.

Story first published: Thursday, August 1, 2019, 12:32 [IST]
Other articles published on Aug 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X